లైట్స్ వేసుకుని సెక్స్.. ఆ మజానే వేరంటున్న యువత
Lifestyle: సాధారణంగా ఒక జంట ఏకాంతంగా ఉన్నప్పుడు రొమాన్స్ చేసుకుంటారు. లైట్స్ ఆపేసి శృంగారంలో పాల్గొంటేనే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం మారుతోంది. కొందరు జంటల ద్వారా చేపట్టిన సర్వేల్లో లైట్స్ ఆపేసినప్పుడు కంటే లైట్స్ ఆన్‌లో ఉన్నప్పుడే శృంగార జీవితాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తామని అంటున్నారు. లైట్స్ ఆన్‌లో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొంటే.. భాగస్వామిని చూస్తూ ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆనందాన్ని పొందుతామని తద్వారా శారీరక బంధం మరింత బలపడుతుందని కపుల్స్ అంటున్నారు.
సర్వేల్లో పాల్గొన్న జంటలు చెప్పిన కొన్ని అభిప్రాయాలు ఇవే
“” మాకు వివాహమై ఆరేళ్లు అవుతోంది. ఇప్పటికీ మేం ఎంతో అన్యోన్యంగా ఉంటాం. శృంగార జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తాం. అయితే ఎప్పుడూ లైట్స్ లేకుండా రొమాన్స్ చేసుకునే మేము.. ఒకసారి లైట్స్ ఆన్ చేసి సెక్స్‌లో పాల్గొనాలని అనుకున్నాం. అలా ఓసారి ప్రయత్నించాక మేం మా సెక్స్ లైఫ్‌ని మరింత ఎంజాయ్ చేసాం అనిపించింది. మా మధ్య కెమిస్ట్రీ మరింత బలపడింది “”
“” సెక్స్ చేస్తున్నప్పుడు నాకు నా భార్య ముఖం, కళ్లు చూడటం ఎంతో ఇష్టం. అందుకే లైట్స్ వేసుకునే సెక్స్‌లో పాల్గొంటాం. ఆ సమయంలో తను కళ్లతో చేసే సైగలు నన్ను మరింత ప్రేరేపిస్తాయి. ఆ భావన మాటల్లో చెప్పలేనిది “”
“” వెలుతురులో సెక్స్ చేసుకుంటున్నప్పుడు నేను నా భాగస్వామి ఎంతో దగ్గరగా ఉన్నట్లు ఫీలవుతాం. శరీరంలోని ప్రతి చలనాన్ని చూడగలిగినప్పుడు కలిగే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది “”
“” లైట్స్ వేసుకుని సెక్స్‌లో పాల్గొనడం వల్ల కలిగే లాభం ఏంటంటే.. మన భాగస్వామి ఎలాంటి హావభావాలు ఇస్తున్నారో తెలుసుకోవచ్చు. వారికి సౌకర్యంగా ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. కొందరు ఇష్టం లేకపోయినా సెక్స్ చేస్తూ ఉంటారు. అలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తెలిసిపోతుంది “”
“” కొందరు నగ్నంగా ఉన్నప్పుడు తమ శరీర శైలిని తన భాగస్వామి ఇష్టపడతారో లేదో అనే సందేహంతో ఎంతో కుమిలిపోతుంటారు. అలాంటివారు లైట్స్ వేసుకుని శృంగార చర్యను అనుభవిస్తే.. ఒకరి పట్లు ఒకరికి ఉన్న ఆత్మన్యూనత భావనలు తగ్గిపోతాయి“”