Why Some People Cheat: ఎందుకు మోసం చేస్తారు?
Why Some People Cheat: కొందరు ఆడవాళ్లు తమ భర్తలతో.. మరికొందరు మగవాళ్లు తమ భార్యాలతో ఆనందంగానే ఉంటారు. వారికే లోటూ ఉండదు. అయినప్పటికీ వారిని మోసం చేస్తుంటారు. మోసం చేయడం అనేది పొరపాటుగా జరిగేది కాదు. అది ఒకరి ఛాయిస్‌పై ఆధారపడి ఉంటుంది. కొందరేమో తమ భాగస్వామ్యుల నుంచి రావాల్సిన ప్రేమ, ఆప్యాయతలు లేక మోసం చేస్తుంటారు. మరికొందరికి అన్నీ ఉన్నప్పటికీ మోసం చేస్తారు. అలా ఎందుకు? కొందరు ఎందుకు చీట్ చేస్తుంటారో ఒక రీసెర్చ్‌లో వెల్లడైంది. ఆ అంశాలేంటో తెలుసుకుందాం.
కొన్నిసార్లు చీట్ చేస్తే వచ్చే థ్రిల్‌ని అనుభూతి చెందాలని ఇలా మోసం చేస్తుంటారట.
మరి కొందరికి మరీ పర్‌ఫెక్ట్‌గా ఉండే మగవాళ్లు, ఆడవాళ్లు నచ్చరట.
అదీకాకుండా తమ కంటే కాస్త పెద్దవారితో ఉండాలని కోరుకుంటారు.
కొందరు మేసోచిస్ట్‌లా ఉంటారు. మేసోచిస్ట్ అంటే ఆనందంగా ఉన్న జీవితాన్ని కాకుండా కాస్త బాధలో ఉండాలని అనుకుంటారట. అలా బాగా చూసుకునేవారిని వదిలేసి టార్చర్ పెట్టేవారితో ఉండాలని అనుకుంటారు.
ఇంకొందరు మోనోగమీని నమ్మరు. మోనోగమీ అంటే ఒకరితోనే ఉండటం. ఇలాంటివారు పాలిగమీని నమ్ముతారు. పాలిగమీ మల్టిపుల్ పార్ట్‌నర్స్‌ని మెయింటైన్ చేయడం.