Seema Anand: నోరు తెరిస్తే సెక్స్.. శృంగారం గురించి మాత్రమే మాట్లాడే ఎవరీమె?
Seema Anand: సెక్స్ అనే మాట గురించి బయట డిస్కస్ చేస్తే తప్పుగా చూస్తారు. ఇలాంటి విషయాలు పబ్లిక్ ప్లాట్‌ఫాంపై మాట్లాడటం ఏంటి అని విమర్శలు గుప్పిస్తారు. కానీ పై ఫోటోలో ఉన్న మహిళను చూసారా? ఈమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్. పేరు సీమా ఆనంద్. ఈమె లండన్‌లో స్థిరపడిన భారతీయురాలు. ఇంతకీ ఈమె ఎందుకు ఇంత ఫేమస్ అంటే.. ఈవిడ నోరు తెరిస్తే సెక్స్ అనే మాట తప్ప మరొకటి రాదు. అలా ఎందుకు అని ప్రశ్నిస్తే.. సెక్స్ గురించి సమాజంలో నెలకొన్న తప్పుడు అభిప్రాయాలు, సందేహాలను పటాపంచలు చేయడం తన ధర్మం అని చెప్తున్నారు.
సీమకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈమె సెక్స్ విషయంలో ఎంతో రీసెర్చ్ చేసారు. దాంతో సెక్స్ గురించి సమాజంలో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం గురించి తన భర్తకు చెప్తే ఆయన వద్దన్నారు. అయినా సీమా వినలేదు. దాంతో సీమా భర్త వదిలేసి వెళ్లిపోయారు. కానీ సీమాకు తన ముగ్గురు పిల్లలు సపోర్ట్ చేసారు. అలా సోషల్ మీడియాలో సెక్స్ గురించి వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. చాలా మంది ఆమె ఇలా మాట్లాడటం పట్ల అసభ్యకరమైన కామెంట్స్ పెడుతుంటారు. ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ముందు తరాలకు సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన అస్సలు ఉండదని సీమా చెప్తున్నారు. ఇప్పుడు సీమా శృంగారం గురించి తాను చేసిన రీసెర్చ్‌ని ఓ పుస్తక రూపంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.