Abrosexuality: కొన్ని రోజులు అబ్బాయితో కొన్ని రోజులు అమ్మాయితో..!
Abrosexuality: మార్కెట్‌లోకి కొత్త సరుకు వచ్చినట్లు.. సమాజంలో రోజుకో కొత్త లింగం పుట్టుకొస్తోంది. ఇప్పటివరకు మనకు తెలిసిన లింగాలు మేల్, ఫీమేల్, LGBTQ. ఇవి కాకుండా ఇటీవల సింబయో సెక్సువల్ అనే కొత్త లింగం గురించి అమెరికాలోని సియాటిల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పరిశోధనల్లో తెలిసింది. ఇప్పుడు తాజాగా మరో లింగం బయటికి వచ్చింది. అదే ఆబ్రో సెక్సువల్.
ALSO READ: Symbiosexual: ప్రేమికుల మధ్య దూరే ఈ లింగం వారితో జాగ్రత్త..!
ఆబ్రో సెక్సువల్ అంటే ఏంటి?
ఇప్పుడు మనకు తెలిసినంత వరకు అబ్బాయిలకు అమ్మాయిలను చూస్తే ఫీలింగ్స్ వస్తాయి. అమ్మాయిలకు అబ్బాయిలను చూస్తే ఫీలింగ్స్ పుడతాయి. అదే అబ్బాయిలను అబ్బాయిల పట్ల కోరికలు కలుగుతున్నాయంటే వారిని గే అంటారు. అదే విధంగా అమ్మాయిలకు అమ్మాయిలను చూస్తే కోరికలు పుడుతున్నాయంటే వారిని లెస్బియన్ అంటారు.
ఈ ఆబ్రో సెక్సువల్ అంటే ఏంటంటే.. కొన్ని రోజులు ఒక లింగం వారి పట్ల మరికొన్ని రోజులు మరో లింగం వారి పట్ల ఆకర్షితులయ్యేవారినే ఆబ్రో సెక్సువల్ అంటారు. వీరు ఒక లింగం వద్దే ఆగిపోరు. కొన్ని రోజులు కేవలం అమ్మాయిలతోనే ఉంటారు. మరికొన్ని రోజులు హార్మోన్స్ మారడం వల్ల అబ్బాయిలతో ఉంటుంటారు. ఆబ్రో అనేది గ్రీక్ పదం. అంటే కోరికల్లో మార్పులు జరగడం అని అర్థం. ఈ ఆబ్రో సెక్సువల్ లింగం వారు కొన్ని సార్లు కేవలం ప్రేమలో ఉండాలని అనుకుంటారు. ఇంకొన్ని సార్లు కేవలం సెక్స్ చేసి విడిపోవాలని అనుకుంటారట.