Lifestyle: “పెంపుడు కుక్క వల్ల శారీరకంగా కలవలేకపోతున్నాం”
Lifestyle: “”మాకు పెళ్లై ఐదేళ్లు అవుతోంది. పిల్లలు వద్దనుకున్నాం. అందుకే ఓ కుక్కను తెచ్చి పెంచుకుంటున్నాం. అదంటే మాకు ప్రాణం. అయితే అది మా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి మేం కలయికలో పాల్గొనలేదు. ఏం చేయాలో సలహా ఇవ్వండి“”
నిపుణుల సలహా: మీ పెంపుడు కుక్కకి మీ శృంగార జీవితానికి సంబంధం ఏంటి? ఇది ఆశ్చర్యకరమైన సమస్యలా అనిపిస్తోంది. పిల్లలు ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనలేకపోతున్నాం అనే వారి గురించి విన్నాం కానీ.. ఇలా కుక్క ఉండటం వల్ల శృంగార జీవితం ఇబ్బందిగా ఉంది అనేవారిని మిమ్మల్నే చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ.. మీకున్న అసలు సమస్య ఏంటో చెప్పలేదు. కేవలం కుక్క ఉండటం వల్ల కలయిక సాధ్యం కావడంలేదు అంటే.. కుక్కను మీతో పాటే మంచంపై పడుకోబెడుతున్నారా? అలాగయితే మీరు కలయికను ఆస్వాదించాలనుకున్న సమయంలో కుక్కను వేరే గదిలో ఉంచితే సరిపోతుంది.