Lifestyle: అత్తగారు అమ్మ అవ్వాలంటే..?
Lifestyle: చాలా మంది కోడళ్లకు అత్తలతో పడదు. అలాగే అత్తలు కూడా కోడళ్లని తమ గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటారు. మన భారతదేశంలో చాలా మటుకు కాపురాలు కూలిపోవడానికి అత్తాకోడళ్ల గొడవలే కారణమని పలు నివేదికలు కూడా చెప్తున్నాయి. అత్తగారు అమ్మలా.. కోడలు కూతురిలా చూసుకునే అదృష్టం చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి అదృష్టం లేని వారు బంధాలు తెంచుకోవడం.. వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పించడం.. వదిలేసి వేరే కాపురాలు పెట్టడం కాకుండా ఈ టిప్స్ పాటిస్తే అత్తను అమ్మలా మార్చుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు.
*మీ ఇంట్లో అమ్మతో ఎలా కబుర్లు చెప్తూ ఉంటారు.. మీ అత్తగారితో కూడా అలాగే వీలున్నప్పుడల్లా సరదాగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. ఆవిడ మాట్లాడట్లేదు.. నేనెందుకు మాట్లాడాలి అనే ధోరణి వద్దు. ఒక వయసు వచ్చాక వారిలో చాదస్తం పెరిగిపోతుంది. కాస్త కోడళ్లే అప్పుడప్పుడూ సర్దుకుపోతుండాలి.
*వంట చేయడం.. గార్డెనింగ్.. పూజలు.. శుభ్రం చేసే కార్యక్రమాలు.. ఇలాంటివి ఏవైనా ఉంటే కలిసే చేయండి. ఇలాగైతే ఇద్దరి మధ్య కాస్త ఫ్రెండ్లీనెస్ పెరుగుతుంది. పనుల్లో ఒకరికొకరు సాయం చేసుకంటున్నట్లూ ఉంటుంది.
*అత్తా కోడళ్లు తల్లీ కూతుళ్లలా కలిసిపోవాలంటే.. ముందు ఇద్దరిలో ఉన్న కామన్ ఆసక్తులు ఏంటో తెలుసుకోవాలి. ఇద్దరికీ ఒక విషయం పట్ల కానీ ఒక వంటకం పట్ల కానీ సేమ్ ఫీలింగ్ ఉంటే అది బంధాన్ని బలపరుస్తుంది.
*అప్పుడప్పుడూ ఒకరినొకరు పొగుడుకునేందుకు ప్రయత్నించండి. అత్తగారు ఏదన్నా వంట చేసినప్పుడో లేదా కోడలు ఒక మంచి చేసినప్పుడో చాలా బాగా చేసారు అని కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటే అది మరింత చేరువ చేస్తుంది.