Relationships: ఈ లక్షణాలుంటే అతను మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే..!
Relationships: రిలేషన్‌షిప్స్‌లో నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలే లేనిదే ఆ నమ్మకం అని చెప్పాలి. ఈ రోజుల్లో నిజమైన ప్రేమ దొరకాలంటే రాసి పెట్టుండాలి. అయితే.. రిలేషన్‌పిష్‌లో ఒక మగాడు తన ప్రియురాలిని మోసం చేస్తున్నాడు అని చెప్పడానికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయట. అవేంటంటే..
మీకు అవసరం ఉన్నప్పుడు కానీ.. లేదా మీకు వీలు కుదిరినప్పుడు కానీ మీ ప్రియుడు మీకు అందుబాటులో ఉండకపోవడం
.తనకు అవసరం ఉన్నప్పుడు తనకు బోర్ కొట్టినప్పుడు మాత్రమే మీతో మాట్లాడాలని అనుకోవడం.
మీకు నచ్చిన విషయాల్లో అతను పాలు పంచుకోకపోవడం.. మీకు నచ్చిన విషయాన్ని అసలు లెక్క చేయడకపోవడం.
భవిష్యత్తు గురించి పెళ్లి గురించి మాట్లాడాలనుకున్నప్పుడల్లా మాట దాటేస్తుండడం.
మీరు అతన్ని కలవాలనుకున్న ప్రతీసారి ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకోవాలనుకోవడం.
తన పర్సనల్ లైఫ్‌లో జరిగే అంశాలను మీతో షేర్ చేసుకోకుండా మిమ్మల్ని బయటి వ్యక్తిలా పరిగణించడం
అతని స్నేహితులకు కుటుంబీకులకు మీ గురించి తెలీనివ్వకుండా మిమ్మల్ని దూరంగా ఉంచడం
తనకు నచ్చే అంశాలను మాత్రమే మీతో చెప్తూ.. మీకు నచ్చినవి చెప్తున్నప్పుడు వినకుండా విసుక్కోవడం
పైన చెప్పినవి కేవలం అబ్బాయిలకే కాదు.. అమ్మాయిలకు కూడా వర్తిస్తాయి. ఇలాంటి లక్షణాలు మీ పార్ట్‌నర్‌లో కనిపిస్తున్నట్లైతే.. కచ్చితంగా వారు మిమ్మల్ని అవసరాలకు వాడుకుంటున్నారని అర్థంచేసుకోండి.