Lifestyle: శృంగారం స‌మ‌యంలో గ‌మ‌నించాల్సిన రెడ్ ఫ్లాగ్స్..!

observe these red flags in bed room

Lifestyle: రెడ్ ఫ్లాగ్.. ఈ మ‌ధ్య‌కాలంలో ఈ ప‌దం త‌ర‌చూ వినిపిస్తోంది. రెడ్ ఫ్లాగ్ అంటే ఒక బంధంలో కానీ ఒక వ్య‌క్తి ప్ర‌వ‌ర్త‌న‌లో ఇబ్బందికి గురిచేసే ల‌క్ష‌ణాలు.. అభ్యంత‌ర‌క‌ర‌మైన ప్ర‌వ‌ర్త‌లను క‌లిగి ఉండ‌టం. ఉదాహ‌ర‌ణ‌కు.. మీరు మీ స్నేహితుడికి డ‌బ్బు సాయం చేసారు అనుకుందాం. అత‌ను మీకు వారం రోజుల్లో డ‌బ్బు తిరిగిస్తాడు అని చెప్పాడు. కానీ వారం దాటిపోయి నెల‌లు గ‌డుస్తున్నా ఆ డ‌బ్బు ఇవ్వ‌కుండా త‌ప్పించుకుని తిరుగుతుంటాడు. ఇది అత‌నిలో మీకు క‌నిపించే రెడ్ ఫ్లాగ్. అంటే.. అత‌ను మాట మీద నిల‌బ‌డ‌డు.. మోసం చేసే వ్య‌క్తిత్వం ఉన్న‌వాడు అని అర్థ‌మ‌వుతుంది.

ఈ రెడ్ ఫ్లాగ్ ఎక్కువ‌గా రిలేష‌న్‌షిప్స్‌లో ప‌రిశీలించాలి అంటారు. ఈ రెడ్ ఫ్లాగ్స్ అనేవి సాధార‌ణ సంద‌ర్భాల్లో కాకుండా కొన్ని కీల‌క స‌మ‌యాల్లో మ‌న‌కు తెలుస్తుంటాయి. అవి తెలిసిన‌ప్పుడు ఆ బంధంలో కొన‌సాగాలా లేదా అని మ‌న‌కి మ‌నం ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి. ప‌డ‌క గ‌దిలో మీ పార్ట్‌న‌ర్‌లో ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉన్న‌ట్లు మీకు అనిపిస్తే జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంటుంది.

ఇంత‌కీ ఏంటా రెడ్ ఫ్లాగ్స్?

శృంగారం చేసే స‌మ‌యంలో వారి మాటే నెగ్గాలి అన్నట్లు ప్ర‌వ‌ర్తించ‌డం

ఏమైనా కొత్త భంగిమ‌లు ప్ర‌య‌త్నించాల‌నుకున్న‌ప్పుడు మీకు కంఫ‌ర్ట్‌గా ఉందో లేదో అడ‌గ‌కుండా ఇష్ట‌మొచ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తించ‌డం

నీకు ఎలా అనిపించినా నాకు అన‌వ‌స‌రం.. నాకు మాత్రం ఇలాగే న‌చ్చుతుంది అని సెల్ఫిష్‌గా ఉండ‌టం.

శృంగారం అనంత‌రం నా ప‌ని అయిపోయింది అన్న‌ట్లు మిమ్మ‌ల్ని ప‌ట్టించుకోకుండా వెంట‌నే నిద్ర‌లోకి జారుకోవ‌డం

ప్రొటెక్ష‌న్ లేకుండా సెక్స్ కావాల‌ని బ‌ల‌వంతంగా ఒప్పించాల‌నుకోవ‌డం

ఎమోష‌న్స్‌కి ఏమాత్రం విలువ ఇవ్వ‌కుండా నీ శ‌రీరంతోనే నాకు ప‌ని అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తించ‌డం

శృంగార ప్ర‌క్రియ నాకు నచ్చిన‌ట్లే జ‌ర‌గాలి అని డిమాండ్ చేయ‌డం

పైన చెప్పిన‌వ‌న్నీ రెడ్ ఫ్లాగ్సే. ఇలాంటి మీ పార్ట్‌న‌ర్‌లోనూ ఉంటే మాత్రం ఆ బంధం ఎంతో కాలం నిలిచే అవ‌కాశం ఉండ‌దు.