Lifestyle: నెట్‌ఫ్లిక్స్ నా సెక్స్ లైఫ్‌ని నాశనం చేసింది
Lifestyle: ఈ మధ్య నేను నా భార్య కలిసి నెట్‌ఫ్లిక్స్‌లో ఓ వెబ్ సిరీస్ చూసాం. అందులో చాలా గాఢమైన శృంగారభరిత సన్నివేశాలు ఉన్నాయి. అందులో చూపించినవన్నీ నా భార్య ట్రై చేద్దాం అంది. నేను కూడా ఎగ్జైట్ అయ్యాను. ఇందుకోసం ఆ సిరీస్‌లో చూపించినవన్నీ కొనుగోలు చేసాం. మొదట్లో బానే ఉంది కానీ ఇప్పుడు నా భార్య పిచ్చి పీక్స్‌కి వెళ్లిపోయింది. దాంతో ఇప్పుడు నాకు ఆ పద్ధతులు నచ్చడంలేదు. అలా వద్దు సహజంగానే ప్రయత్నిద్దాం అంటే గొడవ పెడుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ నెట్‌ఫ్లిక్స్ నా సెక్స్ లైఫ్‌ని నాశనం చేసింది. ఏం చేయమంటారో సలహా ఇవ్వగలరు
నిపుణుల సలహా
మీ బాధ అర్థం అవుతోంది. మీరే కాదు ఈ మధ్య మా దగ్గరికి ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ముందు మీ భార్యతో ఉన్నది ఉన్నట్లు చెప్పి చూడండి. మీ ఇబ్బందిని వివరించింది. మీ బంధం ప్రేమ ఆప్యాయతతో ముడిపడిందే తప్ప కేవలం లైంగిక ఆనందం కోసమే కాదు అని తెలియజేయండి. ఏదన్నా అనుభవించాలంటే అది ఇద్దరికీ సమంజసం అయితేనే అందులో ఆనందాన్ని వెతుక్కోగలం అని చెప్పండి. సినిమాల్లో, ఓటీటీల్లో చూపించే శృంగారభరితమైన సన్నివేశాలు కేవలం నాటకీయం మాత్రమే అని అర్థమయ్యేలా వివరించండి. అవి రియల్ లైఫ్‌లో అప్లై చేస్తే వర్కవుట్ కావని వివరించండి. అయినా వినకపోతే ఓసారి కౌన్సిలింగ్ ఇప్పించండి. ముందు అలాంటి వెబ్‌సిరీస్‌లకు కొంతకాలం దూరంగా ఉండండి.