Lifestyle: పెళ్లికి ముందే శారీరకంగా కలుద్దాం అంటున్నాడు
Lifestyle: నా వయసు 26. పెళ్లి కుదిరింది. అయితే కొన్ని కారణాల వల్ల పెళ్లి ముహూర్తం వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే ఆరు నెలలు దాటిపోయింది. ఈ ఆరు నెలల్లో మేం బాగా క్లోజ్ అయ్యాం. అయితే ఈ విషయాన్ని ఆసరాగా తీసుకుని పెళ్లికి ముందే సెక్స్ చేద్దాం అంటున్నాడు. అది కరెక్టే అంటారా? నాకు తన మీద నమ్మకం ఉంది కానీ ఎటూ ఇంకొన్ని రోజుల్లో పెళ్లైపోతుంది కదా అనిపిస్తోంది. సలహా ఇవ్వగలరు.
నిపుణుల సలహా
మీ ఆలోచన కరెక్టే. ఎటూ ఇంకొన్ని రోజుల్లో పెళ్లైపోతుంది అంటున్నారు. అప్పటివరకు ఆగమని మీకు కాబోయే వారికి చెప్పండి. ఆరు నెలలు సరదాగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు శారీరకంగా కలవాలనుకుంటున్నారు? అందులో తప్పేమీ లేదు. ఎవరి ఇష్టం వారిది. కానీ మీ పెద్దలు మీపై నమ్మకం ఉంచి.. పెళ్లికి ముందే అన్ని చోట్లకు సరదాగా తిరిగి రండి అని పంపుతున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకపోవడమే మంచిది. ఇకపోతే.. వీలైనంత త్వరగా ఓ మంచి ముహూర్తం పెట్టించుకుని ఆ మూడు ముళ్లు ఏడు అడుగులు వేసేయండి. ఆల్ ది బెస్ట్