Lifestyle: సెక్స్ పేరు చెప్పి ఇంటి పనులు చేయించుకుంటోంది
Lifestyle: నా సమస్యను ఎలా చెప్పుకోవాలో తెలీడం లేదు. నా భార్య నన్ను సెక్స్ బెయిట్లా వాడుకుంటోంది. అంటే ఇంట్లో ఏదన్నా పని చేయాలంటే బేబీ ముందు ఈ పని చేసేయ్ ఆ తర్వాతే బెడ్రూంలోకి రా అంటోంది. ఇలా నా చేత చాలా పనులు చేయించుకుంది. కానీ ఇదీ ఓ సంసారమేనా. నాకు నచ్చడంలేదు. ఏం చేయమంటారు?
నిపుణుల సలహా
మీ భార్య మీతో మొదటి సారి ఆ పని చేస్తేనే బెడ్రూంలోకి రా అన్నప్పుడే మీరు ఇది కరెక్ట్ కాదు అని నచ్చజెప్పాల్సింది. మీరు చెప్పింది చేసుకుంటూపోయి ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. పనులు చేయించుకోవడం కోసం ఇలా ఊరించడం అనేది సంసారమే కాదు. ఇది చాలా తప్పు కూడా. మీరు ముందు అన్నింటికీ అలా తలూపడం మానుకోండి. మీ భార్యతో మాట్లాడి చూడండి. లేదంటే కౌన్సిలింగ్ బెటర్ ఆప్షన్.