Lifestyle: భార్య “త‌ల్లి”గా మారితే ఎలా?

my wife treating me lke a kid

Lifestyle: మాది ల‌వ్ మ్యారేజ్. అమెరికాలో స్థిర‌ప‌డ్డాం. నాకు నా భార్య‌కు పెద్ద‌గా గొడ‌వ‌లంటూ ఏమీ లేవు. కానీ న‌న్ను భ‌ర్త‌లా కాకుండా ఓ బిడ్డ‌Lifestyle: మాది ల‌వ్ మ్యారేజ్. అమెరికాలో స్థిర‌ప‌డ్డాం. నాకు నా భార్య‌కు పెద్ద‌గా గొడ‌వ‌లంటూ ఏమీ లేవు. కానీ న‌న్ను భ‌ర్త‌లా కాకుండా ఓ బిడ్డ‌లా ట్రీట్ చేస్తోంది. అదే నాకు న‌చ్చ‌డం లేదు. నాకు నా భార్య భార్య‌లా ప్రేమ పంచాలి కానీ “త‌ల్లి”లా ప్ర‌వ‌ర్తిస్తే ఎలా? నేను ఇటీవ‌ల ప‌ని మీద వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వ‌చ్చింది. అప్పుడు త‌న‌కు ఫోన్ చేసి మిస్స‌వుతున్నాను అని చెప్పాను. అప్పుడు త‌ను సాధార‌ణంగా భార్య‌లు ఎలా స్పందిస్తారో అలా స్పందించ‌కుండా.. ఇక్క‌డే ఉన్నా క‌దా.. త్వ‌ర‌గా నా ద‌గ్గ‌రికి వ‌చ్చేస్తావు క‌దా.. ఏం భ‌య‌ప‌డ‌కు అని చిన్న‌పిల్లాడికి స‌ల‌హాలు ఇచ్చిన‌ట్లు ఇస్తోంది. ప‌డ‌క గ‌దిలోనూ ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తోంది. ఇదేమ‌న్నా రుగ్మ‌త అంటారా?

నిపుణుల స‌ల‌హా

మీ స‌మ‌స్య అర్థ‌మైంది. ఇలాంటి కొన్ని జంట‌ల‌ను నేను క‌లిసాను కూడా. మీది ల‌వ్ మ్యారేజ్ అంటున్నారు. మీరు ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు త‌ను ఎప్పుడూ మీతో ఇలా ప్ర‌వ‌ర్తించ‌లేదా? అలా లేదు అంటే ఇప్పుడు కొత్త‌గా మొద‌ల‌వ‌డానికి కార‌ణం ఏంటో తెలుసుకోవాలి. కొన్ని జంట‌లు ఒక‌ర్నొక‌రు ఇలాగే ముద్దు చేసుకుంటూ ఉంటాయి. మీ భార్య కూడా ఇలాగే మిమ్మ‌ల్ని ముద్దు చేస్తున్నారేమో. ఇదేమీ రుగ్మ‌త కాదు. భ‌య‌ప‌డ‌కండి. ఆమె మీపై చూపిస్తున్న ఒక ర‌క‌మైన ప్రేమ మాత్ర‌మే. మీకు ఇది న‌చ్చ‌క‌పోతే ఒక‌సారి ప్రశాంతంగా ఆమెతో క‌లిసి కూర్చుని మాట్లాడండి. ఇలా వ‌ద్దు అని సున్నితంగా చెప్పండి. ఆమె త‌ప్ప‌కుండా అర్థంచేసుకుంటుంది.