Lifestyle: నా భార్య ఓ గురూజీని కలిసింది.. నాతో సెక్స్ చేయనంటోంది
Lifestyle: నా భార్య ఇటీవల ఓ గురూజీని కలిసింది. ఆ తర్వాత ఆమెలో ఆధ్యాత్మిక భావనలు ఎక్కువైపోయాయి. అందులో తప్పేమీ లేదు. కానీ ఓ భర్తగా నాకు ఇవ్వాల్సిన సంతోషాన్ని ఇవ్వడంలేదు. నాతో శారీరకంగా కలవనంటోంది. ఏం చేయమంటారు?
నిపుణురాలు డాక్టర్ చాందినీ తుగ్నైత్ సలహా
మెయిల్‌లో మీ భార్య వయసు తెలియజేయలేదు. ఒకవేళ చిన్న వయసే అయితే.. ఎందుకు ఆధ్యాత్మికత వైపు ఆమె దారి మళ్లిందో తెలుసుకోండి. ఆమె నిర్ణయాలను కూడా గౌరవించండి. ఆధ్యాత్మికతతో ఉండటం తప్పు కాదు కానీ అది భార్యాభర్తల మధ్య సమస్యలు తెచ్చేలా ఉండకూడదు అని నచ్చచెప్పండి. ఒకవేళ ఆమె మీ మాట వినకపోతే.. ఆ గురూజీ ఎవరో తెలుసుకుని ఆయన్ను సంప్రదించి చూడండి. ఎందుకు మీ భార్య ఇలా మారిపోయిందో అడగండి. వీలైతే గురూజీనే మీ భార్యకు నచ్చజెప్పమని కోరండి. తప్పకుండా మార్పు వస్తుంది.