Lifestyle: అత్తగారు నా బిడ్డకు తన పాలు పడుతున్నారు
Lifestyle: నాకు మూడు నెలల బాబు ఉన్నాడు. బాబు నిద్రపోతున్నాడు కదా అని నేను స్నానానికి వెళ్లాను. స్నానం ముగించుకుని బయటికి వచ్చి చూస్తే నా బిడ్డకు మా అత్తగారు పాలుపడుతున్నారు. అది చూసి నేను షాకయ్యాను. ఆకలితో ఏడుస్తుంటే పాలు పట్టాను అని చెప్తోంది. నా బిడ్డకు ఈ వయసులో ఆమె పాలు పట్టడమేంటి? నా భర్తకు చెప్తే అయ్యిందేదో అయ్యింది వదిలేయ్ అంటున్నాడు. నాకు ఇలా జరగడం నచ్చలేదు. ముందు ముందు ఇలా జరగకుండా ఉండాలంటే ఆమెతో ఎలా మాట్లాడాలో వివరించగలరు.
నిపుణుల సలహా
బిడ్డ ఏడుస్తుంటే పాలు పట్టాను అని చెప్పింది అంటున్నారు. కాబట్టి ఆవిడ ఉద్దేశంలో ఎలాంటి తప్పు లేదు. ఇకపోతే.. మీకు మీ అత్తగారిలో ఎలాంటి రిలేషన్ ఉందో దానిని బట్టి మీరు మాట్లాడాలి. ఒకవేళ ఆవిడకి మీకు అంతంత మాత్రమే మాటలు ఉంటే నిదానంగా నొప్పించకుండా చెప్పండి. కొందరు అత్తాకోడళ్లు ఇలాంటి విషయాలను చాలా ఓపెన్‌గా చర్చించేసుకుంటూ ఉంటారు. మీకు కూడా అలాంటి రిలేషనే ఉంటే ఇది పెద్ద సమస్య కానే కాదు.