Lifestyle: నా ప్రియుడు నన్ను భార్యగా పరిచయం చేస్తున్నాడు.. ఇది కరెక్టేనా?
Lifestyle: నేను ఒక అబ్బాయితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాను. నాకు తనంటే చాలా ఇష్టం. కానీ తనకు నేనంటే ప్రాణం. నన్ను తన ఫ్రెండ్స్‌కి పరిచయం చేసే సమయంలో నా గర్ల్‌ఫ్రెండ్ అని చెప్పకుండా నా భార్య అని చెప్తున్నాడు. మాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇలా భార్య అని చెప్పడం కరెక్టే అంటారా?
నిపుణుల సలహా: మీ ప్రియుడు మిమ్మల్ని భార్య అని పరిచయం చేస్తున్నాడంటే మీరే అతని భాగస్వామి అని డిసైడ్ అయిపోయాడు. ఈ విషయంలో మీరు చాలా అదృష్టవంతులు. అయితే.. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్తే సంతోషమే. అలాకాకుండా మధ్యలో ఏవన్నా సమస్యలు వస్తే ఇద్దరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు పెళ్లి కాకపోయినా బయటి వారికి భార్య అని పరిచయం చేస్తున్నాడంటే వారు మీకు పెళ్లైపోయింది అనుకునే అవకాశం ఉంది. ఒకవేళ పరిస్థితులు తారుమారై అతనితో మీ పెళ్లి జరగకుండా వేరొకరితో జరగాల్సి వస్తే.. మిమ్మల్ని మీ ప్రియుడు ఎవరికైనా భార్య అని పరిచయం చేస్తున్నారో పొరపాటున వారి ద్వారా మీకు కాబోయే భర్తకు విషయం తెలిస్తే అసహ్యంగా ఉంటుంది. మీకు మీ ప్రియుడితో పెళ్లి జరగదేమో అని చెప్పడంలేదు. కీడెంచి మేలెంచమంటారు కదా..! అందుకే మీ ప్రియుడికి అర్థమయ్యేలా చెప్పండి. ఎటూ భార్య అని పరిచయం చేస్తున్నాడు కాబట్టి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుందాం అని చెప్పండి. లేదంటే మిమ్మల్ని భార్యగా పరిచయం చేయడం ఇబ్బందికరంగా ఉందని వివరించండి.