Lifestyle: అందంగా లేవు ఇక నీతో లైంగికంగా క‌ల‌వ‌లేను అంటున్నాడు

my husband told me that i am not at all attractive

Lifestyle: నా వ‌య‌సు 34. వివాహమై 8 ఏళ్లు అవుతోంది. ఒక ఐదేళ్ల వ‌ర‌కు మేం మా దాంప‌త్య జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేసాం. కానీ ఈ మ‌ధ్య‌కాలంలో నా భ‌ర్త నాతో క‌ల‌వ‌డంలేదు. ఓసారి ఉండ‌బ‌ట్ట‌లేక నేనే అడిగేసాను. అందుకు ఆయ‌న నాతో అన్న మాట‌లు మ‌ర్చిపోలేక‌పోతున్నాను. నువ్వు అందంగా లేవు. నీతో సెక్స్ చేయ‌లేను అన్నాడు. అది విని ఎంత బాధ‌ప‌డ్డానో మాటల్లో చెప్ప‌లేను. ఇప్పుడు నేనేం చేయాలి? ఆయ‌న్ని వ‌దిలేయాలా?

నిపుణుల స‌ల‌హా

వ‌య‌సు పెరిగే కొద్దీ శ‌రీరంలో మార్పులు జ‌ర‌గ‌డం స‌హ‌జం. దానిని కూడా మీ భ‌ర్త ఓ స‌మ‌స్య‌లా చూస్తున్నాడంటే అత‌ని ప‌ట్ల జాలేస్తోంది. వ‌య‌సు మీకే కాదు. మీ భ‌ర్త‌కూ అవుతుంద‌ని తెలియ‌జేయండి. వ‌య‌సు పెరిగే కొద్దీ ఇంకా ఇర‌వైల్లో మాదిరిగా క‌నిపించాలంటే ఎలా కుదురుతుంది అని న‌చ్చ‌జెప్పండి. మీ వ‌య‌సు 34 అంటున్నారు. సహ‌జంగా అయితే మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేసేవారికి 35 వ‌ర‌కు అస‌లు వ‌య‌సు తెలీదు. ఇక‌పోతే.. మీరు మీ భ‌ర్త ముందు ఎంత అందంగా ముస్తాబ‌వుతున్నారో కూడా ఒక‌సారి ఆత్మ ప‌రిశీల‌న చేసుకోండి. అంటే మీరు పార్ల‌ర్‌కి వెళ్లి ఫేషియ‌ల్స్ వంటి చేయించుకోమ‌ని కాదు. చిన్న చిన్న మార్పులు చాలు. అలాంటివి ఏమ‌న్నా ప్ర‌య‌త్నించి చూడండి. మీ భర్త ఇక ఎంత‌కీ మీరు చెప్పింది అర్థం చేసుకోకుండా నువ్వు అందంగా లేవు అని మాటిమాటికీ అంటుంటే మాత్రం ఓసారి కౌన్సిలింగ్‌కి తీసుకెళ్లండి. కౌన్సిలింగ్ వ‌ల్ల ఎంతో కొంత మార్పు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.