Lifestyle: భార్య ఫోటోలను పోర్న్ సైట్స్‌లో పెట్టేసాడు
Lifestyle: ఓ వివాహితకు షాకింగ్ అనుభవం ఎదురైంది. పదేళ్ల నుంచి కాపురం చేస్తున్న భర్తే తన పరువును బజారులో అమ్మకానికి పెట్టేసాడని తెలిసి ఆవేదన చెందింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. లీసా అనే మహిళకు పదేళ్ల క్రితం పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వారం రోజుల క్రితం లీసా పిల్లలతో కలిసి ఓ ట్రిప్‌కి వెళ్లిందట. భర్తను కూడా రమ్మంటే అతను ఆఫీస్ పని ఉందని చెప్పి తప్పించుకున్నాడట.
అయితే చాలా కాలంగా తన భర్త తనకు తెలీకుండా వెనక ఏదో చేస్తున్నాడని లీసాకు అనుమానంగానే ఉండేదట. కానీ ఎప్పుడూ అడగలేదు. ఓసారి తన భర్తకు తెలీకుండా ఫోన్ చెక్ చేసింది. అందులో కొన్ని తెలీని నెంబర్లకు తన ఫోటోలు, వీడియోలు పంపినట్లు ఉన్నాయట. ఆ నెంబర్లు ఎవరివి అని తెలిసిన వారి ద్వారా ఆరా తీయించగా.. పోర్న్ వెబ్‌సైట్లకు చెందినవారి నెంబర్లు అని తెలిసింది. దాంతో ఆమె నిర్ఘాంతపోయింది. తన ఫోటోలు, వీడియోలు పోర్న్ సైట్లలో పెట్టించి వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నాడట.
ఈ విషయం తనకు తెలిసిందన్న విషయం తన భర్తకు ఇంకా చెప్పలేదని.. త్వరలో విడాకులకు అప్లై చేసి అప్పుడు అన్ని వివరాలు బయటపెడతానని లీసా రెడిట్ అనే యాప్ ద్వారా తన జీవితంలో ఎదురైన సంఘటనను నెటిజన్లకు తెలియజేసింది. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరింది.