Lifestyle: నచ్చాడని అడిగినంత కట్నం ఇచ్చి చేసుకున్నా.. నన్ను సెక్స్ డాల్‌లా వాడుకుంటున్నాడు
Lifestyle: నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి చూపుల్లో అతన్ని చూడగానే ఎంతో నచ్చాడు. కానీ మా అమ్మానాన్నలు అతని వాలకం బాలేదు అని చెప్పినా కూడా వినకుండా కొన్ని కోట్లు ఇచ్చి మరీ చేసుకున్నాను. పెళ్లైన నెల రోజుల వరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నుంచి నన్ను ఓ సెక్స్ డాల్‌గా చూడటం మొదలుపెట్టాడు. తిన్నావా ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా అడిగిన పాపాన పోలేదు. ఎంతసేపూ తనకు కావాల్సిన శారీరక సుఖం కోసమే నా దగ్గరికి వస్తాడు. ఈ నేపథ్యంలో నాకో పాప పుట్టింది. ఈ మధ్యే నాకు తెలిసిన మరో విషయం ఏంటంటే.. అతని మాజీ ప్రియురాళ్లతోనూ టచ్‌లో ఉన్నాడు. ఏం చేయాలో తెలీడం లేదు. సలహా ఇవ్వగలరు.
నిపుణుల సలహా: మీ తల్లిదండ్రులు అతని వాలకం ముందుగానే పసిగట్టారు అంటున్నారు. అప్పుడు వారు చెప్పినట్లు విని ఉంటే సరిపోయేది. మీది పెద్దలు కుదిర్చిన వివాహమే కాబట్టి.. అతని పద్ధతిని అత్తామామలు, అమ్మానాన్నలకు చెప్పండి. మీ దగ్గర తగిన ఆధారాలు ఉంటే మరీ మంచిది. లేదంటే మీరే ఏదో ఒక వంకతో కావాలని గొడవపడుతున్నారు అనుకుంటారు. మీకు ఓ పాప ఉంది. కాబట్టి ఇప్పుడు పాప భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. ఇంట్లో వారి ద్వారా చెప్పించిన తర్వాత కూడా అతని పద్ధతి మారకపోతే కౌన్సిలింగ్ ఇప్పించండి. పాప భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయం అయినా తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి.