Lifestyle: తమ్ముడితో ప్రేమగా ఉంటే తప్పుగా అనుకుంటున్నాడు
Lifestyle: నాకు నా తమ్ముంటే ప్రాణం. వాడు ఇంటికి వచ్చినప్పుడల్లా ఎంతో ప్రేమగా చూసుకుంటాను. ఎక్కువ సమయం తనతో ఉండటానికే ఇష్టపడతాను. అది నా భర్తకు నచ్చడంలేదు. కుళ్లుకుంటున్నాడు. అన్నాతమ్ముళ్ల బంధానికి కూడా ఈ రోజుల్లో పేర్లు పెట్టేస్తున్నారు. న నా భర్త ఆలోచన మారేదెలా?
నిపుణుల సలహా
మీ అక్కాతమ్ముళ్ల విషయంలో మీ భర్త “వేరేలా” కుళ్లుకుంటున్నాడు అని మీకు ఎవరు చెప్పారు? మీ భర్త చెప్పారా? లేక మీకు మీరే అనుకుంటున్నారా? మీ భర్తకు సమయం ఇవ్వడం లేదని ఆయన కుళ్లుకుంటుండచ్చేమో కదా. మీరే తప్పుగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనిపిస్తోంది. మీ తమ్ముడు తన బావతో ఫ్రెండ్లీగా ఉండడా? ఒకవేళ ఉంటే ముగ్గురూ కలిసి అన్ని విషయాలను షేర్ చేసుకోవడం.. ఎంజాయ్ చేయడం వంటివి చేయచ్చు. కాబట్టి ముందు మీ భర్తది “వేరే” అనుమానం అనే విషయాన్ని పక్కనపెట్టండి. లేదంటే ఓసారి మీ భర్తతో మనసారా మాట్లాడి చూడండి. ఆయన బాధేంటో తనే చెప్తారు కదా. దానిని బట్టి ఏం చేయాలో మీరు ఓ నిర్ణయానికి రావచ్చు.