Lifestyle: నా భర్త ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటున్నాడు
Lifestyle: మేడమ్.. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలీక ఇలా మెయిల్ రాస్తున్నాను. నాకు పెళ్లై ఆరు నెలలు అవుతోంది. అయితే నా భర్త ఒక మగాడిలా ప్రవర్తించడం లేదు. ఆషాఢ మాసం వస్తే ఆడవాళ్లు పెట్టుకోవాల్సిన గోరింటాకు ఆయన పెట్టుకుంటున్నాడు. బయట ఇల్లు ఊడ్చి ముగ్గులు వేస్తున్నాడు. ఏంటండీ ఈ పనులు అంటే మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముంది అంటున్నాడు. ఆయనలో ఏ లోపం లేదు. కానీ ఒక మగాడిలా కాకుండా ఇలా ఆడంగి పనులు చేస్తుంటే నాకు కాపురం చేయాలన్న ఆలోచన కూడా రావడం లేదు. ఏం చేయమంటారు?
నిపుణుల సలహా
మీ బాధ అర్థమవుతోంది. మీ భర్తలో ఏ లోపం లేదు అంటున్నారు కాబట్టి సమస్య లేదు. ఇక గోరింటాకు పెట్టుకోవడం, ఇల్లు ఊడ్చి ముగ్గేయడం వంటివి చూస్తుంటే ఆయన మీకు సాయం చేసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నాడు అనిపిస్తోంది. ఇక గోరింటాకు సంగతి అంటారా.. కొందరు అబ్బాయిలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ మీకు అలా చేయడం నచ్చకపోతే నిదానంగా చెప్పేయండి. ఆయనే మారతారు. ఎన్నిసార్లు చెప్పినా అలాగే ప్రవర్తిస్తుంటే కౌన్సిలింగ్‌కి తీసుకెళ్లండి. తప్పక పరిష్కారం లభిస్తుంది.