Lifestyle: వర్జిన్ కాదని వేధిస్తున్నాడు
Lifestyle: నాకు పెళ్లై ఆరు నెలలు అవుతోంది. కొన్ని నెలలు నా భర్త నాతో సవ్యంగానే ఉన్నాడు. కానీ కలయిక తర్వాత నా యోని రంధ్రం పెద్దదిగా ఉందని.. నేను వర్జిన్‌ని కానని అంటున్నాడు. ఈ విషయంలో నన్ను రోజూ వేధిస్తున్నాడు. చావాలనిపిస్తోంది. దీనికి ఏదన్నా పరిష్కారం చెప్పగలరు.
నిపుణుల సలహా
మీకు ఇలాంటి సమస్య రావడం నిజంగా బాధాకరం. హైమెన్ (యోని రంధ్రంలోని పొర) తెగి ఉన్నంత మాత్రాన వర్జినిటీ కోల్పోయినట్లు కాదని మీ భర్తకు సవివరంగా చెప్పి చూడండి. కొందరు ఆడవాళ్లు రఫ్ అండ్ టఫ్‌గా ఎగరడాలు, దూకడాలు, సైకిల్ తొక్కడాలు చేస్తుంటారు. అలాంటి సమయాల్లో రాపిడి వల్ల సహజంగానే కొందరు ఆడవాళ్లలో వారి హైమెన్ తెగి ఉంటుంది.
ఒకవేళ అలా కాకుండా పెళ్లికి ముందు ఎవరితోనైనా కలిసినప్పుడు కూడా హైమెన్ తెగి ఉంటుంది. అది ఒకరి వ్యక్తిగత జీవితంపై ఆధారపడి ఉంటుంది. వారి నిర్ణయాల పట్ల గౌరవం లేకుండా నువ్వు వర్జిన్ కావు అని అనడం పొరపాటే. ఒకసారి మీ భర్తతో మాట్లాడి చూడండి. లేదంటే కౌన్సిలింగ్‌కి తీసుకెళ్లండి. ఎంత చెప్పి మార్పు రాకపోతే మీకు ఇంకా పిల్లలు లేరు కాబట్టి ఇంట్లో వాళ్ల ద్వారా చెప్పించండి.