Lifestyle: నేను ఓకే చెప్పేలోపే మ‌రో వ్య‌క్తితో నా గ‌ర్ల్‌ఫ్రెండ్ సెక్స్ చేసింది

my girlfriend had sex with another man

Lifestyle: ఓ యువ‌కుడు త‌న ప్రేమ విష‌యంలో ఓ అమ్మాయికి ఓకే చెప్పేలోపే ఆమె మ‌రో వ్య‌క్తితో సెక్స్ చేసిన‌ట్లు తెలిసింద‌ట‌. దాంతో ఇప్పుడు ఏం చేయాలో తెలీని స్థితిలో ఉన్నానంటూ సోష‌ల్ మీడియాలో త‌న క‌థ‌ను రాసుకొచ్చాడు.  జాన్ అనే 27 ఏళ్ల వ్య‌క్తి.. జాస్ అనే 22 ఏళ్ల అమ్మాయితో డేటింగ్ చేసాడు. అయితే వీరిద్ద‌రూ ఒక‌రికొక‌రు య‌స్ చెప్పుకోక ముందే ప‌లుమార్లు డేట్‌కి వెళ్లారు. క్రిస్మ‌స్ తర్వాత త‌మ రిలేష‌న్‌షిప్‌ని అధికారికంగా త‌మ ఫ్రెండ్స్‌కి అనౌన్స్ చేయాల‌నుకున్నారు. ఈ నేప‌థ్యంలో క్రిస్మ‌స్ త‌ర్వాత చిన్న గెట్ టుగెద‌ర్ ఏర్పాటుచేసుకున్నార‌ట‌.

ఆ పార్టీలో జాస్ ఓ అబ్బాయి వైపు చూస్తూ సైగ‌లు చేయ‌డం జాన్ గ‌మ‌నించాడు. కానీ పార్టీలో అంద‌రి ముందు అడిగితే ప‌రువు పోతుంద‌ని ఏమీ అడ‌గ‌కుండా ఉండ‌లేక‌పోయాడు. ఆ త‌ర్వాత పార్టీ అయిపోయి అంద‌రూ ఇంటికి వెళ్లిపోయాడు. జాన్ కూడా తాను చూసిన విష‌యం గురించి జాస్‌ని అడ‌గ‌లేదు. అంతా బాగానే ఉంది అనుకుంటుండ‌గా.. జాన్‌కి ఓ అన్‌నోన్ నెంబ‌ర్ నుంచి మెసేజ్ వ‌చ్చింది. ఆ మెసేజ్‌లో హాయ్‌.. నీకు ఈ విష‌యం తెలుసో తెలీదో. నేను జాస్ క్రిస్మ‌స్‌కి ముందు సెక్స్ చేసుకున్నాం. ఎందుకో చెప్పాల‌నిపించి చెప్తున్నా అని రాసుంది.

దాంతో జాన్ షాక‌య్యాడు. ఈ విష‌యం గురించి జాస్‌ని అడిగితే ఆమె నిజ‌మే అని ఒప్పుకుంది. అయితే ఇలా ఎందుకు చేయాల్సి వ‌చ్చింది అని అడ‌గ్గా… మ‌నం ఇంకా ఒక‌రికొక‌రు ఓకే అని కానీ య‌స్ అని కానీ చెప్పుకోలేదు కదా అందుకే వేరొక‌రితో డేట్‌కి వెళ్లిన‌ప్పుడు ఇలా జ‌రిగింది అని చెప్పింద‌ట‌. ఈ విష‌యాన్ని జాన్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. త‌న‌కు ఏం చేయాలో అర్థంకావ‌డంలేద‌ని.. ఏద‌న్నా స‌ల‌హా ఉంటే ఇవ్వాల‌ని అడుగుతున్నాడు. దాంతో నెటిజ‌న్లు త‌మ‌కు తోచిన స‌ల‌హాలు ఇస్తున్నారు.