Lifestyle: నా కూతురి యోని పెద్దగా ఉంది.. పెళ్లి వద్దంటోంది
Lifestyle: మా పాపకు 24 ఏళ్లు. మంచి సంబంధం కుదిరింది. అందుకే చేసేద్దామని అనుకుంటున్నాం. కానీ నా కూతురి యోని కాస్త పెద్దదిగా ఉంది. 24 ఏళ్ల అమ్మాయికి ఉండాల్సినట్లుగా లేదని.. తనలో లోపం ఉందని పెళ్లి వద్దంటోంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే కూడా భయపడుతోంది. ఏం చేయమంటారు?
నిపుణుల సలహా
యోని పెద్దగా ఉండటం అసలు సమస్యే కాదు. కొందరికి కలయిక సమయంలో కట్ అవ్వాల్సిన హైమెన్ పొర కొన్ని కారణాల వల్ల కలయిక జరగకుండానే కట్ అయిపోతుంది. ఇది బేసిక్ సైన్స్. ఇక మీ అమ్మాయి అనవసరంగా భయపడుతోంది. అసలు అది సమస్యే కాదు అని సర్దిచెప్పండి. లేదా కౌన్సిలింగ్ ఇప్పించండి. లేదా పెళ్లి విషయంలో తనకు ఇంకాస్త సమయం ఇచ్చి చూడండి.