Lifestyle: ఐదేళ్లు ప్రేమించి వదిలేసిపోయాడు
Lifestyle: మాది ఐదేళ్ల ప్రేమ. ముందు తనే ప్రపోజ్ చేసాడు. నాక్కూడా నచ్చడంతో ఓకే చెప్పాను. ఐదేళ్లు కలిసి ఉన్నాం. ఉన్నట్టుండి ఏమైందో తెలీదు. నాతో మాట్లాడటం లేదు. కనీసం మెసేజ్కి మర్యాదగా రిప్లై కూడా ఇవ్వడు. అసలు ఏం జరిగిందో తెలీదు. తెలుసుకుందామని మెసేజ్ చేస్తే ఇగ్నోర్ చేసేవాడు. దాంతో మా అమ్మ ఫోన్ నుంచి మెసేజ్ చేసాను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అన్నాడు. ఆ సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసాను. దాదాపు ఆరు నెలల పాటు ఏడవని రోజంటూ లేదు.
ఒకప్పుడు కాల్స్, మెసేజ్లతో సమయం తెలిసేది కాదు. పార్టీలు, హాలిడేలు అంటూ తెగ తిరిగాం. ఉన్నట్టుండి ఏమైంది? నేను బోర్ కొట్టేసానా? లేదా నేనే తప్పు చేసానా? నాకు సమాధానం కావాలి. అందుకోసమే ఎదురుచూస్తున్నాను. అమ్మాయిలు మోసం చేసే ఎదవలకే పడతారు అని అంటుంటారు. అమ్మాయికైనా అబ్బాయికైనా ప్రేమించాకే తెలుస్తుంది మోసం చేస్తున్నారా లేక నిజాయతీగా ప్రేమిస్తున్నారా అని. నేను మంచి అబ్బాయినే ప్రేమించాను అనుకున్నాను. ఎందుకంటే ఈ ఐదేళ్లలో నాతో ప్రవర్తించిన తీరులో ఎక్కడా మోసం కనిపించలేదు. బహుశా ఐదేళ్లు నాతో నటించాడేమో. నేను ఎవరో ఈ మెయిల్లో చెప్పకపోయినా ఇది తను చదివి తప్పకుండా నాకు మెసేజ్ చేస్తాడు అని చిన్న ఆశ.