Lifestyle: నా బాయ్‌ఫ్రెండ్‌కి నేనంటే పిచ్చి.. నన్నెవరన్నా చూసినా కొట్టేస్తాడు
Lifestyle: నేను ఒక అబ్బాయితో రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. తనకు నేనంటే పిచ్చి. ఎంతగా అంటే.. నన్ను ఎవరన్నా చూసినా.. నాపై కామెంట్ చేసినా ముందు వెనకా చూసుకోకుండా కొట్టేస్తాడు. నాకు అతనంటే భయమేస్తోంది. ఏం చేయమంటారు?
నిపుణుల సలహా: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీరంటే మీ ప్రియుడికి ఎంత ఇష్టమో అర్థమైంది. కానీ ఇలా మిమ్మల్ని చూస్తేనో ఏదన్నా అంటేనో కొట్టేస్తానంటే రూల్స్ ఒప్పుకోవు కదా..! ఒకవేళ మీ పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తున్నారంటే అతనికి కోపం రావడంలో తప్పు లేదు. కానీ దానికి చట్టాలు పోలీసులు ఉన్నారు. ఇలాంటి ఘటన ఎదురైనప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మంచిది. అంతేకానీ అలా కొట్టేస్తే ఇద్దరూ స్టేషన్‌లో కూర్చువాల్సి వస్తుంది. మీ భయంలో అర్థముంది. ఒకసారి మీ ప్రియుడికి మీరే అర్థమయ్యేలా చెప్పండి. ఇలా అయితే జీవితాంతం కలిసి ఉంటే మరిన్ని సమస్యలు వస్తాయని వివరించండి. మీరు కూర్చోబెట్టి నచ్చజెప్తే వింటాడు అనిపిస్తోంది. అలా కూడా వినకపోతే అతనిది అగ్రెసివ్ నేచర్ అనుకోవాలి. అప్పుడు కచ్చితంగా సైకాలజిస్ట్‌ని కలిసి కౌన్సిలింగ్ ఇప్పించండి. తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది.