పీరియడ్స్ సమయంలో శృంగారం… తెలుసుకోవాల్సిన అంశాలు
Period Sex: నెలసరి విషయంలో చాలా మందికి ఉండే సందేహం.. పీరియడ్స్ సమయంలో సెక్స్‌లో పాల్గొనవచ్చా అని. కొందరేమో ఆ సమయంలో కలిస్తే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం.. నొప్పులు ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు వస్తాయని భయపడతుంటారు. అసలు ఈ విషయంలో నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం.
పీరియడ్స్ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం సర్వసాధారణం అని అంటున్నారు ప్రముఖ సెక్స్ థెరపిస్ట్ నేహా అగర్వాల్. ఇంకా చెప్పాలంటే.. పీరియడ్స్ సమయంలో సెక్స్ చేస్తే కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావట. నెలసరి నొప్పులు తగ్గుతాయట.. యోని భాగం కూడా బాగా ల్యూబ్రికేట్ అవుతుందట. పీరియడ్స్ సమయంలో ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ చేస్తే గర్భం దాల్చే అవకాశాలు కూడా తక్కువే అంటున్నారు నేహా.
పీరియడ్స్ సమయంలో సెక్స్‌లో పాల్గొనాలనుకుంటే.. ముందు ఇద్దరూ కూర్చుని చర్చించుకోవడం ఎంతో మంచిది. పీరియడ్స్ గురించి అబ్బాయిలకు పెద్దగా అవగాహన ఉండదు. అలాంటప్పుడు పార్ట్‌నర్ పీరియడ్‌లో ఉందని తెలిస్తే ఈ సమయంలో కలవచ్చా.. ఏమైనా నొప్పిగా ఉందా అనే విషయాలు అడిగి తెలుసుకోవాలి. అలా కాకుండా పీరియడ్స్ సమయంలో సెక్స్ చేసినా ఏమీ కాదు కాబట్టి పార్ట్‌నర్ అనుమతి తీసుకోకుండా ఎలా పడితే అలా ప్రవర్తించేస్తామంటే కుదరదు.
ఇది అమ్మాయిలకు కూడా వర్తిస్తుంది. అమ్మాయిలకు పీరియడ్స్ సమయంలో తమ పార్ట్‌నర్‌తో కలవాలనుకుంటే.. ఈ సమయంలో సెక్స్ చేయడం పార్ట్‌నర్‌కి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అలా ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఎంజాయ్ చేయగలుగుతారు. పీరియడ్స్ సమయంలో ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ చేస్తే గర్భం దాల్చరు అనేది చాలా తక్కువ కేసుల్లో చూస్తాం. గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రొటెక్షన్ తప్పనిసరి. కలయిక అనంతరం ప్రైవేట్ భాగాలను శుభ్రం చేసుకోవడం ఎంతో ముఖ్యం. లేదంటే ఇద్దరికీ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ.