Lifestyle: భార్య పట్టించుకోవడంలేదు.. నాకంటే పెద్దావిడతో ఎఫైర్ పెట్టుకున్నాను
Lifestyle: “” మాది ఘజియాబాద్. నాకు 32 ఏళ్లు. 2019లో పెళ్లైంది. నాకు నా భార్యకు ఎలాంటి సమస్యలు లేవు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. పార్టీలకు, డిన్నర్‌లకు కలిసే వెళ్లే వాళ్లం. అన్నీ బాగుంటే అది జీవితం ఎందుకు అవుతుంది. నాలుగేళ్లు గడిచాక నా భార్య వేరు కాపురం పెడదాం అంది. అందుకు నేను ఒప్పుకోలేదు. ఈ విషయంలో మాకు గొడవలు జరిగాయి. ఆ తర్వాత తను పుట్టింటికి వెళ్లి వస్తాను అంది. నేను ఒప్పుకున్నాను. దాదాపు రెండు నెలల తర్వాత ఇంటికి వచ్చింది. ఆమెలో ఎంతో మార్పు. కనీసం ఎలా ఉన్నావ్ అని కూడా నన్ను అడగలేదు. ఎంత సేపు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియా చూసుకుంటూ కూర్చుంటుంది. కనీసం నన్ను దగ్గరికి కూడా రానివ్వడం లేదు. తనకు ఏదన్నా రీల్ కావాలంటే మాత్రమే నా దగ్గరికి వచ్చి ప్రపంచానికి మేం అన్యోన్య దంపతులం అని చెప్తుంటుంది. కానీ రియాల్టీ వేరు.
ఆ తర్వాత నాకు హైదరాబాద్‌లో ఉద్యోగం రావడంతో షిఫ్ట్ అయ్యాం. హైదరాబాద్‌కి వచ్చినా కూడా నా భార్య పద్ధతి మార్చుకోలేదు. నన్ను పట్టించుకోదు. అసలు భర్త అనేవాడు ఒకడు ఇంట్లో ఉన్నాడన్న విషయం కూడా తను మర్చిపోయినట్లుంది. నాకు ఆఫీస్‌లోనే ఓ అమ్మాయి పరిచయం అయ్యింది. తనది కూడా ఫెయిల్డ్ మ్యారేజ్. భర్త హింసిస్తున్నాడని విడాకులు ఇచ్చేసింది. నాకు తనంటే ఇష్టం. తనకు కూడా నేనంటే ఇష్టం. కాకపోతే నా కంటే తను వయసులో ఐదేళ్లు పెద్దది. నా భార్యకు విడాకులు ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. కానీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అనే టెన్షన్ ఎక్కువగా ఉంది. వాళ్లు పెళ్లికి ఒప్పుకోకపోయినా నన్ను పట్టించుకోని నా భార్యకు మాత్రం విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను “” – ఓ సోదరుడు