Lifestyle: ప్రియుడితో కలవాలని ఉంది.. ఏదన్నా సమస్య వస్తుందా?
Lifestyle: నా వయసు 30. నాకు పుట్టుకతోనే ఒక కిడ్నీ లేదు. నేను ఇంకా వర్జినే. నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నప్పటికీ మేం శారీరకంగా కలవాలని అనుకోలేదు. తను ఒకటి రెండు సార్లు అడిగినా నేను పెళ్లయ్యాకే అని చెప్తూ వస్తున్నా. తను కూడా నన్ను ఫోర్స్ చేయడం లేదు. కానీ నాకు ఒకసారి ఆ కలయిక అనుభూతిని పొందాలని ఉంది. కానీ ఉన్న ఒక్క కిడ్నీకి ఏమన్నా అవుతుందేమో అని కంగారుగా ఉంది. సలహా ఉంటే ఇవ్వండి.
నిపుణుల సలహా: భయం వల్లో లేదా విలువలు తెలిసో 30 ఏళ్లు వచ్చినా మీరు వర్జిన్‌గా ఉండి పెళ్లి తర్వాత కన్యత్వాన్ని కోల్పోవాలనుకోవడం అభినందనీయం. ఎందుకంటే ఈరోజుల్లో మీలా ఆలోచించేవారు ఒక శాతం కూడా ఉన్నారో లేదో డౌటే. ఇప్పుడు మీరు ఆ అనుభూతిని పొందాలనుకుంటున్నారు. ఉన్నట్టుండి మీ అభిప్రాయం ఎందుకు మారింది? ఏదేమైనప్పటికీ అది మీ వ్యక్తిగత అంశం. ఇక మీకు ఒకటే కిడ్నీ ఉంది అంటున్నారు. కిడ్నీకి లైంగిక చర్యకు సంబంధం లేదండీ. మీకు ఇప్పుడు ఒకటే కిడ్నీ ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నట్లైతే మీరు ఆనందంగా లైంగిక చర్యలో పాల్గొనవచ్చు. కానీ మీకు ఆ చర్యలో భాగంగా కిడ్నీపై బరువు పడి నొప్పిగా అనిపిస్తే మాత్రం వెంటనే నెఫ్రాలజిస్ట్, గైనకాలజిస్ట్‌లను సంప్రదించండి.