Lifestyle: నా భార్య బిడ్డను వదిలేయాలనుకుంటున్నా
Lifestyle: “””” నా వయసు 33. పెళ్లైంది. మంచి భార్య. కాకపోతే నాకు ఎందుకో పిల్లలంటే ఇష్టం లేదు. పెళ్లయ్యాక కూడా పిల్లల్ని వద్దనుకున్నాను. కానీ నా భార్య పిల్లలు కావాల్సిందే అని పట్టుబట్టింది. ఒక బిడ్డ చాలని అంది. బిడ్డ పుడితే నాలో ఏదన్నా మార్పు వచ్చి పిల్లల పట్ల నాకున్న అభిప్రాయం మారుతుంది అనుకున్నాను. అలా మాకొక పాప పుట్టింది. ఇప్పుడు పాప వయసు 2 ఏళ్లు. కానీ ఎందుకు బిడ్డని కన్నానా అనిపిస్తోంది. నాకు ఈ తండ్రి జీవితం నచ్చడంలేదు. మా ఆవిడ నా కోసం సమయం కేటాయించండంలేదు. 24 గంటలూ పాప దగ్గరే ఉంటోంది. దాంతో నాకు జీవితం పట్ల విరక్తి కలుగుతోంది.
నా భార్య, బిడ్డను వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలని ఉంది. అలాగని వారికి అన్యాయం చేయను. ఉండటానికి ఇల్లు.. బతకడానికి కావాల్సిన డబ్బు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తాను. నాకు మాత్రం ఇలాంటి జీవితం వద్దు. ఈ విషయాన్ని ముందు నేను నా తల్లిదండ్రులతో ఫ్రెండ్స్‌తో చెప్తే వారికి ఆల్మోస్ట్ నన్ను చంపేంత కోసం వచ్చింది. వారు కోపడటంలో న్యాయం ఉంది. కానీ ఇది నా జీవితం. నా జీవితంలోకి బిడ్డ రావడం వల్ల లైఫ్ అంతా సర్వనాశనం అయిపోయింది. నా బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలీడంలేదు. మంచో చెడో నేను నా జీవితాన్ని నేను అనుకున్నట్లు జీవించాలని కోరుకుంటున్నాను. త్వరలో నా భార్యకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్తాను. ఆ తర్వాత అంతా దేవుడి దయ “””” -ఓ సోదరుడు