Lifestyle: నా భర్త కండోమ్స్ దాచాడు.. అనుమానంగా ఉంది
Lifestyle: మేడమ్.. నాకు పెళ్లై పదేళ్లు అవుతోంది. మూడేళ్లుగా నాకు నా భర్తకు మధ్య ఎలాంటి శారీరక చర్యలు జరగలేదు. అయితే వారం రోజుల క్రితం నేను ఇల్లు శుభ్రం చేస్తుండగా మా వారి షెల్ఫ్‌లో నాకు కండోమ్స్ కనిపించాయి. అయితే అవి వాడనివి. అందుకే నా భర్తను నేరుగా నిలదీయలేదు. ఇప్పుడు నా మైండ్‌లో చాలా అనుమానాలు తిరుగుతున్నాయి. నేరుగా వెళ్లి నిలదీయాలని ఉంది. కానీ ఆయన నాకోసమే అవి తెచ్చారేమో అడిగితే బాధపడతారేమో అని ఆగిపోతున్నాను. ఈ విషయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నా. ఏదన్నా సలహా ఇవ్వగలరు.
నిపుణుల సలహా
మూడేళ్ల నుంచి మీ మధ్య ఎలాంటి లైంగిక చర్య జరగలేదు అంటున్నారు. మీ భర్త దగ్గర వాడని కండోమ్స్ ఉన్నాయంటే కాస్త అనుమానించాల్సిన విషయమే. అయితే ఇక్కడ మీకు పిల్లలు ఉన్నారా లేరా అనే విషయాన్ని చెప్పలేదు. పిల్లలు ఉన్నట్లైతే.. ఇప్పుడు ప్రొటెక్షన్‌తో శృంగారం చేయాల్సిన అవసరం లేదు. ఇలా మీలో మీరే ప్రశ్నలు వేసుకుంటూ ఎంతకాలం అని బాధపడుతూ ఉంటారు. ఒకసారి నెమ్మదిగా కూర్చోపెట్టి అడగండి. ఆయన నుంచి సమాధానం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సమాధానం చెప్పలేక మాట దాటేస్తున్నాడంటే అనుమానించాల్సిందే. ఏదేమైనా మాట్లాడితే కానీ పరిష్కారం దొరకదు. అంతేకానీ మీలో మీరు బాధపడుతూ అనారోగ్య సమస్యలు తెచ్చుకోవద్దు.