Lifestyle: నా భార్య అక్క పట్ల ఆకర్షితుడ్ని అవుతున్నా
Lifestyle: నాకు పెళ్లైంది. నాకు నా భార్య అంటే ఇష్టమే. కానీ ఆమె సోదరి చాలా అందంగా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు. దాంతో ఆమె పట్ల నేను ఆకర్షితుడ్ని అవుతున్నాను. నా కాపురం నేనే కూల్చుకుంటానేమో అని భయమేస్తోంది. సలహా ఇవ్వగలరు.
నిపుణుల సలహా
మీరు ఇలా ఆలోచించడం తప్పని మీ కాపురం నాశనం అవుతుందన్న ఆలోచన మీకు వచ్చిందంటే మీరు చేస్తున్నది తప్పు అని ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. ప్రతి మనిషిలో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. మీ భార్య అంటే ఇష్టం అంటున్నారు. మరి మీ మనసు ఆమె సోదరి వైపు ఎందుకు మళ్లుతోంది? మీరు ఎంత మీ ఫీలింగ్స్‌ని అదుపులో పెట్టుకుంటే మీకు అంత మంచిది. మీ భార్యతో ఎక్కువ సమయం స్పెండ్ చేసేందుకు ప్రయత్నించండి. మీ భార్య సోదరి ఇంటికి వస్తుంటే మీరు అక్కడ ఉండకుండా ఉండేలా ఏదో ఒక్క ప్లాన్ వేసుకోండి. కొన్ని సమస్యలను మనమే కొనితెచ్చుకుంటాం. వాటి వల్ల మన జీవితాలు నాశనం అవుతాయి. వాటిని అదుపులో పెట్టుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది అన్నది మరవకండి.