Lifestyle: ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక..
Lifestyle: ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఉన్నట్టుండి ఈ ప్రపంచానికే దూరం అయితే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. కొందరు ప్రాక్టికల్‌గా ఆలోచించి భవిష్యత్తుపై దృష్టిపెడతారు. మరికొందరు ఆ బాధ నుంచి తేరుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. కానీ హైదరాబాద్‌కి చెందిన విశాల్ (పేరు మార్చాం) మాత్రం ఎవ్వరూ ఊహించని దారిని ఎంచుకున్నాడు. తన కథేంటో అతని మాటల్లోనే తెలుసుకుందాం.
“” హాయ్ ఫ్రెండ్స్. నేను ఉత్తర్‌ప్రదేశ్‌లో పుట్టి హైదరాబాద్‌లో పెరిగిన ఓ వ్యాపారిని. ఇప్పుడు నా వయసు 34. 2014లో నేను ప్రాణంగా ప్రేమించిన నా క్లాస్‌మేట్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అప్పటికే మాది తొమ్మిదేళ్ల ప్రేమ. ఇక త్వరలో పిల్లల గురించి కూడా ప్లానింగ్ చేసుకుంటున్న సమయంలో నా భార్యకు క్యాన్సర్ అని తెలిసింది. పైగా చివరి స్టేజ్ అన్నారు. అసలు నా జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకునేలోపు ఆమె చనిపోయింది. ఆ బాధ నుంచి తేరుకోలేకపోయాను. వ్యాపారంపై దృష్టి పెట్టలేకపోయాను.
Lifestyle: ఇలాగైతే నేను కూడా బతకనేమో అనే భయంతో మా అమ్మానాన్న ఎంత వద్దని మొత్తుకుంటున్నా మరో అమ్మాయితో నాకు పెళ్లి చేసారు. నాకు అసలు ఆ పెళ్లి ఇష్టం లేదు. కానీ ఇలా చెప్తే ఆ అమ్మాయి పాపం ఎక్కడ బాధపడుతుందో అని ముందు నేను ఇష్టపడిన అమ్మాయి గురించి తనకు చెప్పాను. నా బాధ తనకు అర్థమైంది. అంతేకాదు.. కొంతకాలం పాటు భర్తగా కాకుండా స్నేహితుడిలా ఉంటాను అని కూడా చెప్పా. ముందు సంకోచించింది కానీ నా మాజీ భార్య ఆలోచనల నుంచి బయటపడితేనే కదా నేను మీతో సంసారం చేయగలుగుతాను అంది. పోనీలే అర్థం చేసుకుంది అనుకున్నాను.
ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పదు అనుకున్నాను కానీ తను మా అమ్మానాన్నలతో చెప్పింది. దాంతో వారి నుంచి నాకు టార్చర్ ఎక్కువైంది. త్వరగా పిల్లల్ని కనాలి అని. నా దరిద్రం కొద్ది నా ఇష్టంతో జరగాల్సిన చర్య కూడా బలవంతంగానే జరిగింది. అలా మాకు ఒక పాప పుట్టింది. అంతా సర్దుకుంటోంది అనుకుంటున్న సమయంలో కోవిడ్ లాక్‌డౌన్ వచ్చింది. నేను ఇంటికే పరిమితం అయ్యాను. అప్పటికే పాపను తీసుకుని నా భార్య పుట్టింటికి వెళ్లింది. లాక్‌డౌన్ కావడంతో కొన్ని రోజులు అక్కడే ఉంటాను అనడంతో సరే అన్నారు. అదే సమయంలో నాకు ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి రిక్వెస్ట్ పెట్టింది. తెలిసిన అమ్మాయేమో అని యాక్సెప్ట్ చేసి మాటలు కలిపా.
అలా మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ అమ్మాయి అచ్చం నా మాజీ భార్య చూపించిన ప్రేమే చూపిస్తోంది. ఇప్పుడున్న నా భార్యతో బిడ్డను కన్నప్పటికీ.. నాకు నేను ఇష్టపడిన అమ్మాయి నుంచి దక్కిన ప్రేమ ఇప్పుడు ఈ ఫేస్‌బుక్ అమ్మాయి నుంచి రావడంతో నా మనసు అటువైపు మళ్లింది. అలా నా భార్యను మోసం చేసాను. ఈ విషయం ఇప్పటికీ నా భార్యకు తెలీదు. పాప పెద్దది అవుతోందని నేనే ఆ ఫేస్‌బుక్ అమ్మాయితో అన్నీ కట్ చేద్దాం అనుకుంటున్నా. కానీ తను ఎలా స్పందింస్తుందో అనే భయం ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. పాత జ్ఞాపకాలను దాచుకోవడం తప్పులేదు కానీ.. ఆ జ్ఞాపకాల వల్ల మీతో ఉన్నవారి వదిలేయడం, మోసం చేయడం వంటివి చేయకండి. నా జీవితం నాకు నేర్పిన పెద్ద పాఠం ఇదే “”