Lifestyle: అత్త‌కు స‌పోర్ట్ చేసాడు..నేను వేరొక‌ర్ని చూసుకున్నా

i cheated my husband because he supported his mother

Lifestyle: మాది పెద్ద‌లు కుదిర్చిన వివాహం. పెళ్లైన ఏడాదికే పిల్ల‌లు కావాలంటూ అత్తింటివారి నుంచి పోరు. నాకు అప్పుడే క‌నాల‌ని లేదు. ఇదే విష‌యం నా భ‌ర్త‌కు చెప్తే ముందు ఒప్పుకున్న‌ట్లే ఒప్పుకుని ఆ త‌ర్వాత వాళ్ల అమ్మ ద‌గ్గ‌ర నేను పిల్ల‌లు వ‌ద్దంటున్నానని మాట‌మార్చాడు. నాకు అత‌నిపై అస‌హ్యం వేసింది. అత‌నితో మాట్లాడ‌టం మానేసాను. క‌నీసం త‌ప్పు చేసాడ‌న్న ఫీలింగ్ కూడా త‌న‌లో లేదు. నేను ఇంట్లో మౌనంగా ఉంటుంటే ఏం జ‌రిగింది అని కూడా అడ‌గ‌లేదు. నాకు త‌న‌తో జీవితం బాగుండ‌దు అనిపించింది. ఈ క్ర‌మంలో నేను మ‌రో వ్య‌క్తితో స‌న్నిహితంగా ఉంటున్నాను. అత‌ను మనం పెళ్లి చేసుకుందాం నీ భ‌ర్త‌కు విడాకులు ఇవ్వు అంటున్నాడు. న‌న్నేం చేయ‌మంటారు?

నిపుణుల స‌ల‌హా

మీరు ఆల్రెడీ ఏం చేయాలో నిర్ణ‌యించేసుకున్న‌ట్లున్నారు క‌దా. మీ భ‌ర్త మిమ్మ‌ల్ని ఏం జరిగింద‌ని అడ‌గ‌లేదు అంటున్నారు. పోనీ మీరైనా ఒక‌సారి మాట్లాడే ప్ర‌య‌త్నం చేసారా? చేయ‌లేద‌నే అనిపిస్తోంది. మ‌న‌కేద‌న్నా క‌ష్టం వ‌స్తే దాని నుంచి గ‌ట్టెందేందుకు మ‌న ముందున్న ఆప్ష‌న్ల‌న్నీ ప్ర‌య‌త్నించి ఆ స‌మ‌స్య‌కు ఓ ప‌రిష్కారం వెతుక్కోవాలి. కానీ మీరు మాత్రం మ‌రో స‌మ‌స్య‌ను కొనితెచ్చుకున్న‌ట్లు అనిపిస్తోంది. మీరు మీ భ‌ర్త‌తో ప్రేమ‌గా మాట్లాడేందుకు య‌త్నిస్తే ఆయ‌న‌లో మార్పు రావ‌చ్చేమో. ఆ ప్ర‌య‌త్నం చేయ‌కుండా మీరు మ‌రో వ్య‌క్తితో స‌న్నిహితంగా ఉంటున్నాను అన్నారు. అత‌ను మిమ్మ‌ల్ని బాగా చూసుకుంటాడు అన్న గ్యారెంటీ ఏంటి? ఇవ‌న్నీ బాగా ఆలోచించుకోండి. కోపంలో మ‌న‌సు ప‌రి విధాలుగా మ‌ళ్లుతుంది. అలా మ‌న‌సు వెళ్లిన ప్ర‌తి చోటికీ మ‌నం వెళ్ల‌లేం క‌దా. అందుకే బాగా ఆలోచించి ఓ నిర్ణ‌యం తీసుకోవ‌డం ఉత్త‌మం.