Lifestyle: నా భార్య గర్భం దాల్చడంతో మరో స్త్రీ దగ్గరికి వెళ్లా
Lifestyle: నాకు 28 ఏళ్లకు పెళ్లి చేసారు. ఏడాదికే నా భార్య గర్భం దాల్చింది. ఆమె పుట్టింటికి వెళ్లినప్పుడు నేనొక తప్పు చేసాను. కోరికలను ఆపుకోలేక మరో స్త్రీ దగ్గరికి వెళ్లాను. అలాగని నా భార్య అంటే ఇష్టం లేదు అని చెప్పడంలేదు. నాకు విపరీతంగా కోరిక ఉంది. అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. నా భార్య గర్భం దాల్చినప్పుడు కూడా సెక్స్ కావాలని అడిగితే.. బిడ్డకు సమస్య అవుతుంది అని చెప్పి దూరం పెట్టింది. నా సమస్యకు పరిష్కారం లేదా?
నిపుణుల సలహా
పరిష్కారం ఉంది. మీకు ఈ సమస్య ఉందని ఒప్పుకోవడం మంచి విషయం. అయితే మీ భార్య విషయంలో మీరు చేసింది చాలా పెద్ద నేరం. ఆమె గర్భం దాల్చి పుట్టింటికి వెళ్లినప్పుడు మీరు వేరే స్త్రీ దగ్గరికి వెళ్లడం క్షమించరాని నేరం. మీరు ఈ విషయం పట్ల ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటే ముందు మీ భార్యతో చెప్పండి. ఆమె క్షమాపణలు కోరండి. మీకున్న రుగ్మత గురించి చెప్పండి. ఇక మీ కోరికలను అదుపులో పెట్టుకునే విషయానికి వస్తే.. ఎప్పుడైనా వైద్యులను కలిసారా లేదా అనేది మెయిల్లో రాయలేదు.
ఒకవేళ ఇప్పటివరకు ఈ విషయంలో మీరు వైద్యులను సంప్రదించకుండా ఉన్నట్లైతే.. ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎప్పుడెప్పుడు సెక్స్ అనేది ట్రిగ్గర్ అవుతోందో రాసిపెట్టుకోండి. అవసరమైతే మీకు నిపుణులు CBT థెరపీ ఇచ్చే అవకాశం ఉంది. CBT అంటే కాగ్నిటివ్ బిహేవియోరల్ థెరపీ. మీకు ఆ కోరిక కలిగినప్పుడు ధ్యానం చేసుకోవడం అలవర్చుకోండి. ముఖ్యంగా శారీరక వ్యాయామం ఎంతో అవసరం. వ్యాయామం సరిగ్గా చేయగలిగితే శరీరంలో డోపమైన లెవెల్స్ రిలీజ్ అవుతాయి. ఇవి కోరికను అదుపులో ఉంచుతాయి. మీకు పోర్న్, సెక్సువల్ సన్నివేశాలు చూసే అలవాటు ఉంటే దానిని పూర్తిగా మానేయండి. మీరు బాగా నమ్మే వ్యక్తితో ఈ విషయాన్ని పంచుకోండి. అలాగైతేనే మీరు నిజంగా ఈ సమస్య నుంచి బయటపడాలని అనుకుంటున్నట్లు లెక్క. వారు మీకు మద్దతుగా నిలుస్తారు. ఈ సమస్య ఒకే రోజుతో పోదు. సమయం పడుతుంది. ఓపిక పట్టాలి.