Lifestyle: అత్తామామ‌ల అతి ప్రేమ త‌ట్టుకోలేక‌పోతున్నా

i cannot tolerate in laws being very clingy to me

Lifestyle: “” నాకు నా అత్తామామ‌ల‌తో ఎలాంటి స‌మ‌స్య లేదు. వాళ్లు న‌న్ను బాగానే చూసుకుంటారు. కానీ వాళ్లు రోజూ నాకు ఫోన్ చేసి మాట్లాడాల‌నుకుంటున్నారు. నేను ప‌నిలో బిజీగా ఉండి ఒక రోజు మాట్లాడ‌క‌పోయినా మా ఆయ‌న‌కు ఫోన్ చేసి నేను ఎక్క‌డ ఉన్నానో తెలుసుకో అని అడుగుతున్నారు. మ‌రీ ఇలా ఉంటే చాలా క‌ష్టం. ఏదైనా స‌ల‌హా ఇవ్వండి “”

నిపుణుల స‌ల‌హా: మీ అత్తామామ‌లు మిమ్మ‌ల్ని బాగా చూసుకుంటున్నారు అని అన్నారు. సంతోషించాల్సిన విష‌యం. మీకు పిల్ల‌లు ఉన్నారా లేదా అన్న విష‌యం మీ ప్ర‌శ్న‌లో లేదు. ఒక‌వేళ పిల్ల‌లు ఇంకా లేక‌పోతే మాత్రం వారు రోజూ మీతో మాట్లాడాల‌నుకుంటున్నారు అంటే.. వారికి మ‌న‌వ‌డో మ‌న‌వరాలో కావాల‌ని ప‌రోక్షంగా మీకు తెలియ‌జేస్తున్న‌ట్లు అనిపిస్తోంది. మీకు ఇబ్బందిగా ఉంటోంది అంటున్నారు కాబ‌ట్టి వారు నొచ్చుకోకుండా ఓరోజు ఇంటికి భోజ‌నానికి పిలిచి మీ స‌మ‌స్య‌ను వివ‌రించండి. మీకున్న బిజీ షెడ్యూల్‌లో రోజూ ఫోన్‌లో మాట్లాడ‌టం కుద‌ర‌దు అని వారికి అర్థ‌మ‌య్యేలా చెప్పండి. త‌ప్పుకండా స‌మ‌స్య తీరుతుంది.