Lifestyle: నా భార్య లావైపోయంది.. సెక్స్ చేయబుద్ధి కావడంలేదు
Lifestyle: నేను కాలేజ్ రోజుల్లో ఓ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నా వయసు 54. నా భార్య మునుపటిలా అందంగా లేదు. విపరీతంగా లావైపోయింది. ఇప్పుడు ఆమెపై ఆసక్తి రావడంలేదు. నేను పనిచేస్తున్న ఆఫీస్‌లో మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాను. ఆమె నాకు అన్ని విషయాల్లో నచ్చింది. ఇప్పుడు నా భార్యకు విడాకులు ఇవ్వచ్చా?
నిపుణుల సలహా
అసలు మీలాంటి వాళ్లకు మాకు మెయిల్ రాసే అర్హత కూడా లేదు. ఇలాంటి మెయిల్ పెట్టడానికి మీకు సిగ్గుండాలి. మీ వయసేంటి? మీరు మాట్లాడే మాటలేంటి? 50 ఏళ్లు దాటినా ఇంకా మీరు ఇంత నీచంగా ఎలా ఆలోచించగలుగుతున్నారు. మీ భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటున్నారు. వయసు పెరిగే కొద్ది మగవారైనా ఆడవారైనా శారీరకంగా ఎన్నో మార్పులకు గురవుతారు. మీరు ఇప్పటికీ యంగ్ కుర్రాడిలా ఉన్నారా? మీరు ఇంకా యంగ్‌గా ఉండి ఉంటే అప్పుడు మీ భార్య అందం గురించి కామెంట్ చేయడంలో తప్పు లేదు. మీరు కూడా పెద్దవారు అయిపోయి ఉంటారుగా? అయినా ఈ వయసులో మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నారని ధైర్యంగా చెప్తున్నారు. ఇది మీకు తప్పు అనిపించడంలేదా? దయచేసి కౌన్సిలింగ్‌కి వెళ్లండి. మీలాంటి వారి వల్లే సమాజంలోని మగాళ్లంతా ఇంతే అనే ముద్ర పడిపోతోంది.