Lifestyle: నా భర్తని మోసం చేయక తప్పలేదు
Lifestyle: ఇంట్లో నేనొక్కదాన్నే ఆడపిల్లని. మా నాన్న ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండటంతో ఇంట్లో వాళ్లు బలవంతం చేస్తే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను ఓ పంజాబీ కుర్రాడిని పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత ఉద్యోగ రిత్యా బెంగళూరు వెళ్లిపోయాం. మొదటి రెండు మూడు నెలలు నా భర్త నాతో బాగానే ఉన్నాడు. అయితే ఈ మధ్యకాలంలో అతను మరీ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. నేను ఏదన్నా రొమాంటిక్‌గా మాట్లాడితే అతనికి నచ్చదు. విచిత్రం ఏంటంటే.. అసలు రొమాన్స్ అంటే ఏంటో కూడా తెలీనట్లు ప్రవర్తిస్తున్నాడు.
అసలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా మేం శారీరకంగా కలవలేదు. పైగా కార్టూన్ షోలు, సినిమాలు ఎక్కువగా చూస్తాడు. ఇలాంటి వ్యక్తితో నేను పిల్లల్ని ఎలా కనగలను? ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పలేని పరిస్థితి. వాళ్లు ఫోన్ చేస్తే అంతా బాగానే ఉంది ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్తున్నాను. కానీ నాకు నేను ఎలా సర్దిచెప్పుకోవాలి? అందుకే ఫ్రెండ్స్‌తో నా బాధ చెప్పుకున్నాను.
వాళ్లు నన్ను డేటింగ్ యాప్‌లో ఎవరినైనా సెటప్ చేసుకో అని చెప్పారు. అది తప్పని తెలిసినా ఇలాంటి వ్యక్తితో ఉండి నా మిగతా జీవితాన్ని నాశనం చేసుకోవాలని అనుకోలేదు. ఇంట్లో వాళ్లు చెప్పారని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నా బాధ చెప్తే సాయం చేసేందుకు ఇంట్లో వాళ్లు ఎవ్వరూ రారు. పైగా విడాకులు అంటే మా వాళ్లు ఏమైపోతారో అని భయం. అందుకే డేటింగ్ యాప్‌లో పరిచయం అయిన వ్యక్తితో నేను రిలేషన్‌లో ఉన్నాను. అతన్ని పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు నా దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా ఉండేది. నేను చేస్తోంది తప్పని తెలుసు. కానీ నా భర్తను మోసం చేస్తున్నానన్న బాధ కంటే అతని ప్రవర్తన వల్ల నా జీవితం నాశనం అయిపోతోంది అనే బాధే ఎక్కువగా ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను “”
– ఓ సోదరి