Lifestyle: తనతో కలయిక ఎంజాయ్ చేయలేకపోతున్నా.. ఎలా చెప్పాలి?
Lifestyle: నా భార్యతో కలయికను ఎంజాయ్ చేయలేకపోతున్నా. తన నుంచి నాకు సంతృప్తి కలగడం లేదు. ఈ విషయం తనతో ఎలా చెప్పాలో అర్థంకావడంలేదు. సలహా ఇవ్వగలరు.
నిపుణుల సలహా: భార్యాభర్తలంటే అన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడుకోవాలి. సుఖసంతోషాలు పంచుకుంటే సరిపోదు. ఇలాంటి పడక గది విషయాలను కూడా అంతే నిజాయతీగా ఒకరితో ఒకరు చెప్పుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీకున్న సమస్యను క్లుప్తంగా చెప్పలేదు. బహుశా చెప్పడానికి ఇబ్బందిపడుతున్నట్లున్నారు. ఏం ఫర్వాలేదు. మీ భార్యతో కూర్చుని నెమ్మదిగా మీకున్న సమస్యను వివరించండి. తప్పకుండా అర్థంచేసుకుంటుంది. ఒకవేళ సమస్య ఏంటో కూడా తెలీకపోతే బిడియం వదిలి మంచి సెక్సాలజిస్ట్‌ని కలవండి. అందులో తప్పేమీ లేదు.