Lifestyle: అక్కాచెల్లి కవలలు.. గుర్తుపట్టలేక భార్య చెల్లితో భర్త శృంగారం
Lifestyle: వారిద్దరూ కవలలు. ఇద్దరూ ఆడపిల్లలు. పెద్ద అమ్మాయికి పెళ్లైంది. చిన్నమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు. అయితే.. పెద్ద అమ్మాయి భర్త తన భార్య ఎవరో తెలీక కన్‌ఫ్యూజ్ అయ్యి ఆమె చెల్లితో శృంగారం చేసాడు. విచిత్రం ఏంటంటే.. బావా నేను అక్కను కాను అని ఆమె చెప్పకుండా అక్కను కాపురం కూల్చేసింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. లీసా అనే యువతికి ఐదేళ్ల క్రితం జార్జితో పెళ్లైంది. లీసాకు లీనా అనే కవల సోదరి ఉంది. అయితే లీసాకు సంతాన సమస్యలు ఉండటంతో ఆమె పిల్లల్ని కనలేకపోయింది.
ఈ నేపథ్యంలో ఓసారి లీసా పని ఉండి బయటికి వెళ్లింది. ఆ సమయంలో లీనా ఇంటికి వచ్చింది. అప్పుడు జార్జి ఇంట్లోనే ఉన్నాడు. లీనాను చూసి తన భార్య అనుకుని ఆమెతో శృంగారం చేసాడు. అయితే లీనా మాత్రం నోరువిప్పలేదు. ఈ విషయం లీసాకు తెలిసి కుమిలిపోయింది. విడాకులు ఇస్తానంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. జార్జి తన తప్పు తెలుసుకుని క్షమించాలని అడిగినా ఆమె కనికరించలేదు. అక్క కాపురంలో నిప్పులు పోసిన చెల్లెలు లీనా మాత్రం ఏమీ తెలీనట్లు మౌనంగా ఉండిపోయింది. ఈ విషయాన్ని లీసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చాలా మంది నెటిజన్లు లీనాపై పోలీస్ కంప్లైంట్ చేయాలని కామెంట్స్ పెడుతున్నారు.