పుట్టబోయే బిడ్డకి ప్రియురాలి పేరు.. విడాకులిచ్చిన భార్య
Lifestyle: ఓ వ్యక్తి తనకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి మాజీ ప్రియురాలి పేరు పెట్టాలనుకున్నాడు. ఈ విషయం తన భార్యకు చెప్పగా ఆమె వెంటనే విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ విషయాన్ని ఆ మహిళే రెడిట్ యాప్ ద్వారా వెల్లడించడంతో వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల వయసులోనే తనకంటే ఏడాది పెద్ద అయిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుందట. రెండేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి గర్భం దాల్చింది. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి ఆమె భర్త తన మాజీ ప్రియురాలి పేరు పెడతానంటూ పట్టుబట్టాడు. ఎందుకు అని ఆ అమ్మాయి అడగ్గా.. ఇప్పుడు ఆమె నా జీవితంలో లేదు కదా. అలాంటప్పుడు తన పేరు పెడితే తప్పేంటి అంటున్నాడట. ఎంత చెప్పినా వినకపోవడంతో ఆ అమ్మాయి విసిగిపోయింది. వెంటనే విడాకులకు అప్లై చేసింది. ఈ పోస్ట్ రెడిట్ యాప్లో చదివిన చాలా మంది మంచి పని చేసావు అంటూ ప్రశంసిస్తున్నారు.