Lifestyle: సెక్స్ కోరికలు.. కామ వాంఛను తగ్గించుకోవడం ఎలా?
Lifestyle: సెక్స్ అడిక్షన్.. పెద్దా చిన్నా అని లేకుండా అన్ని వయసుల వారిని పట్టి పీడిస్తున్న రుగ్మత ఇది. ఈ రుగ్మత ఉంటే ఇది క్యాన్సర్ కంటే ప్రమాదం. క్యాన్సర్ ఉంటే కేవలం ఆ జబ్బు ఉన్న మనిషే చనిపోతాడు. కానీ ఈ సెక్స్ ఎడిక్షన్ ఉంటే మాత్రం ఆ రుగ్మత ఉన్న మనిషితో పాటు ఇతరులకు కూడా ప్రమాదమే. మరి ఈ ఎడిక్షన్‌ని ఎలా తగ్గించుకోవాలి? అసలు తగ్గించుకునే అవకాశం ఉందా?
ఎప్పుడు చూసినా హస్త ప్రయోగం చేసుకోవాలనుకోవడం… పోర్న్ చూడటం.. లైంగిక చర్యల్లో పాల్గొనాలని అనిపించడం.. ఇవన్నీ సెక్స్ ఎడిక్షన్ కిందికే వస్తాయి. ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికి కూడా ఈ ఎడిక్షన్ ఉంటుంది. ప్రేమించిన వారితో, భాగ్యస్వామితో కాకుండా మల్టిపుల్ వ్యక్తులతో శృంగారం చేయాలన్న ఆలోచనలు వస్తుంటాయి. ఇతరులకు డబ్బులిచ్చి మరీ సెక్స్‌లో పాల్గొనాలనుకుంటారు. దీని వల్ల ఆర్థిక నష్టాలు తప్పవు. దీని వల్ల లైంగిక వ్యాధులు, రోగాలు వస్తుంటాయి.
ఎలా తగ్గించుకోవాలి?
మీకు ఈ రుగ్మత ఉన్నట్లు తెలిస్తే వెంటనే వైద్య సాయం తీసుకోండి. మీ రుగ్మత విషయం గురించి ధైర్యంగా డాక్టర్‌కు చెప్పండి.
మీ రుగ్మత గురించి తెలిసి మీకు సాయం చేయాలనుకునేవారి మధ్య ఉండండి
కాగ్నిటివ్ బిహేవియోరల్ థెరపీ బాగా పనిచేస్తుంది.