Lifestyle: ఎక్కువ శృంగారం.. తక్కువ ఆనందం
Lifestyle: భార్యాభర్తల మధ్య, ఇద్దరు పార్ట్‌నర్ల మధ్య బంధం కలకాలం నిలవాలంటే ఎంత శృంగారం అవసరం పడుతుంది? దీనికి సమాధానం కచ్చితంగా వ్యక్తిగత అంశం. కానీ పరిశోధకులు ఈ అంశంపై కూడూ రీసెర్చ్‌లు చేసేస్తున్నారు. 2015లో అమెరికాకి చెందిన ముగ్గురు వ్యక్తులు 30,000 మందిపై రీసెర్చ్ చేసారు. ఆ రీసెర్చ్‌లో తమకు వచ్చిన డేటాను పబ్లిష్ కూడా చేసారు. ఆ డేటా ప్రకారం.. వారంలో ఒకసారి లైంగిక చర్యలో పాల్గొంటే సరిపోతుందట. రోజూ ఈ చర్యలో పాల్గొన్నంత మాత్రాన భాగస్వామ్యుల్లో ఆనందం మెరుగుపడింది లేదని.. అలాగని మరీ తక్కువ సార్లు పాల్గొన్నా వారిలో అసంతృప్తి ఉన్నట్లు వెల్లడించారు.
శృంగార చర్యలో ఎన్నిసార్లు పాల్గొన్నాం అనేదాని కంటే ఆ సమయంలో కావాల్సిన అవసరాల గురించి మాట్లాడుకున్నవారే అన్యోన్యంగా ఉంటున్నారట. 2017లో చేసిన స్టడీ ప్రకారం పెద్దలు ఏడాదికి 54 సార్లు లైంగిక చర్యలో పాల్గొనేవారట. కానీ పెళ్లి చేసుకున్నవారిలో సెక్స్ ఫ్రీక్వెన్సీ బాగా తగ్గిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. సెక్స్ ఎక్కువగా చేసుకున్నవారిలోనే ఎంజాయ్‌మెంట్ తగ్గిపోయింది. అమెరికాకి చెందిన కార్నిజీ మెలన్ యూనివర్సిటీ పరిశోధనల్లో ఈ విషయం తేలింది.