Lifestyle: ఏ వయసు వారు ఎన్ని సార్లు సెక్స్‌లో పాల్గొంటారు?
Lifestyle: ఇప్పుడున్న సమాజంలో కొన్ని విషయాలు స్ట్రెయిట్‌గా మాట్లాడుకుంటేనే దానిపై అవగాహన కలుగుతుందనేది నిపుణుల మాట. శృంగారం విషయానికొచ్చేసరికి ఇప్పటికీ ఛీ ఛీ ఇలాంటి విషయాలు చర్చించుకోవడం అవసరమా? అనే ఆలోచనా ధోరణి చాలా మందికి ఉంది. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు పిల్లలకే కాదు పెద్దలకీ అవసరం ఉందని ఓ నివేదికలో తేలింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే సర్వేలు, నివేదికలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే ఓ నివేదిక ప్రకారం ఏ వయసు వారికి ఎంత సేపు శృంగారం మంచిది అనే విషయం వెల్లడైంది. ఈ నివేదికకు కావాల్సిన రీసెర్చ్‌ను అమెరికాలోని కిన్సే ఇన్స్టిట్యూట్కి చెందిన విద్యార్ధులు చేసారు. ఇంతకీ ఈ రీసెర్చ్‌లో ఏం తేలిందంటే…
18 నుంచి 29 ఏళ్ల వయసు వారు యంగ్ అడల్ట్స్ కాబట్టి చాలా యాక్టివ్ ఉంటారు. వీరు ఏడాదికి 112 సార్లు సెక్స్‌లో పాల్గొంటారట.
30 నుంచి 39 ఏళ్ల వారు ఏడాదికి 86 సార్లు సెక్స్‌లో పాల్గొంటారట.
40 నుంచి 49 ఏళ్ల వయసు వారైతే 69 సార్లు పాల్గొంటారట.
వయసు పెరిగే కొద్ది ఆ కోరిక తగ్గిపోవడం అనేది సహజమే. అయితే.. అన్ని సార్లు కోరిక తగ్గిపోవడానికి వయసు కారణం కాదు. కొన్ని సందర్భాల్లో జీవన శైలి, అనారోగ్యం, కుటుంబ బాధ్యతలు, ఇతర టెన్షన్ల కారణంగానూ ఆ కోరిక తగ్గిపోతుందని పరిశోధనల్లో తేలింది.
అయితే ఈ శృంగారం అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత విషయం కాబట్టి.. ఇది ఇలా చేస్తేనే కరెక్ట్ అని చెప్పడానికి లేదు. ఒక 1000 మంది జంటలతో చేసిన పరిశోధనల్లో తేలిన విషయాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావించబడ్డాయి.