Lifestyle: బ్రేకప్‌కు దారి తీసే 6 తప్పులు
Lifestyle: రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఏ ఒక్కరు తగ్గకపోయినా రాజీ పడలేకపోయినా ఆ బంధం నిలవదు. అయితే.. తెలిసో తెలీకో రిలేషన్‌షిప్‌లో ఈ కామన్ తప్పులు చేస్తుంటారు. ఈ తప్పుల వల్లే 80 శాతం బ్రేకప్స్ అవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఏంటా తప్పులు?
రిలేషన్‌షిప్‌లో కోపం, బాధ, ప్రేమ, సంతోషం ఇలా అన్నీ పంచుకోవాల్సి ఉంటుంది. మీ పార్టనర్ సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు వారికి అందుబాటులో ఉంటూ బాధలో ఉన్నప్పుడు పక్కన లేకపోతే మాత్రం ఆ బంధానికి అర్థం లేదు.
రిలేషన్‌షిప్‌లో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ మీ పార్ట్‌నర్ నెరవేర్చాలని అనుకోవడం మూర్ఖత్వం.
బాధలో లేదా కోపంగా ఉన్నప్పుడు మీ పార్ట్‌నర్ దగ్గర చెప్పుకోవడంలో తప్పు లేదు. అలాగని.. వేరే సమస్యలకు కూడా మీ పార్ట్‌నర్‌పైనే కేకలు వేయడం తప్పు.
తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలిస్తారు.. సరిదిద్దుతారు. మీ పార్ట్‌నర్‌ను కూడా ఇలాగే ఉండాలని అనుకోకూడదు. మీకంటూ ఒక బాధ్యత.. ఆలోచనా విధానం.. ఐడియాలజీ ఉండాలి. అన్నీ మీ పార్ట్‌నరే చూసుకోవాలి.. తప్పులు చేస్తుంటే సరిదిద్దుతూ ఉండాలి అంటే కుదరదు.