Lifestyle: మ‌ర్మాంగాన్ని స‌ర్జ‌రీ ద్వారా పెద్ద‌గా చేసుకోవ‌చ్చా?

can i increase my penis size through surgery

Lifestyle: నా వ‌య‌సు 28. ఇంకా పెళ్లి కాలేదు. అస‌లు చేసుకోవాల‌ని కూడా లేదు. నాకు గ‌ర్ల్‌ఫ్రెండ్ కూడా లేదు. నాలో ఏదో లోపం ఉంద‌ని కాదు కానీ.. నా అంగం మ‌రీ చిన్న‌గా ఉంది. అది అనారోగ్య స‌మ‌స్య అని పెళ్లి కాద‌ని నా ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు అది త‌లుచుకున్న ప్ర‌తీసారి అవ‌మానంగా ఉంది. స‌ర్జ‌రీ ద్వారా అంగాన్ని పెంచుకోవ‌చ్చ‌ని విన్నాను. అది నిజ‌మేనా? చేయించుకుంటే ఏమ‌న్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

నిపుణుల స‌ల‌హా

అంగం సైజు చిన్న‌గా ఉంటే స‌మ‌స్య అని మీ ఫ్రెండ్స్ అన్నారు అంటున్నారు. వాళ్లేమీ డాక్ట‌ర్లు కారు క‌దా. మీరు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఇక మీరు మాట్లాడుతున్న స‌ర్జ‌రీ గురించి చెప్పాలంటే.. ఎస్.. ఆ స‌ర్జరీ అందుబాటులో ఉంది. కానీ అది మీకు అవ‌స‌రం లేదు అనిపిస్తోంది. ఈ మ‌ధ్య‌కాలంలో ఏదో ఫ్యాష‌న్ కోసం పీనిస్ లెంతెనింగ్ స‌ర్జరీలు చేయించుకుంటున్నారు. అది బాగా అనుభ‌వం ఉన్న వైద్యులు మాత్ర‌మే చేయాలి. లేదంటే లేని పోని అనారోగ్య స‌మ‌స్య‌లకు దారి తీసే అవ‌కాశం ఉంది. ఒక‌టి గుర్తుపెట్టుకోండి.. అంగం సైజు పెద్ద‌గా ఉన్నంత మాత్రాన‌ శృంగారం బాగా చేయొచ్చు అనుకుంటే అది పొర‌పాటే. కాబ‌ట్టి మీరు ఎలాంటి టెన్ష‌న్ పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేదు. మీకు ఇంకా అనుమానంగా ఉంటే ఓసారి వైద్యుడిని నేరుగా క‌లిసి మీ అనుమానాల‌ను దూరం చేసుకోండి.