Friendship Marriage: ప్రేమ లేదు సెక్స్ లేదు కేవ‌లం స్నేహం.. ఏంటీ కొత్త ట్రెండ్?

all you need to know about the new trend Friendship Marriage

Friendship Marriage:  స్నేహితులు ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకోవ‌డం చూసాం? కానీ స్నేహితులు స్నేహితులుగా ఉండ‌టానికి కూడా పెళ్లిళ్లు చేసుకుంటారని తెలుసా? దీనినే ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ అంటారు. ప్ర‌స్తుతం జ‌పాన్‌లో ఇది బాగా ట్రెండ్ అవుతోంది. జ‌పాన్‌లోని ప్ర‌తి 124 మిలియ‌న్ జ‌నాభాలో 1 శాతం మంది ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌కు మొగ్గు చూపుతున్నారు. అస‌లేంటీ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్?

ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ అంటే ఒక మ‌గ‌, ఆడ స్నేహితులు పెళ్లి చేసుకోవ‌డం. కాక‌పోతే వారి మ‌ధ్య సాధార‌ణ ల‌వ‌ర్స్ మ‌ధ్య ఉండే అనుబంధం ఉండ‌దు. అంటే ప్రేమ‌, సెక్స్ చేసుకోరు. కానీ పెళ్లి చేసుకుని స్నేహితుల్లాగే ఉంటారు. ఒక‌వేళ పిల్ల‌లు కావాల‌నుకుంటే మాత్రం ద‌త్తత తీసుకోవ‌డం వంటివి చేస్తారే త‌ప్ప త‌మ ఫ్రెండ్‌షిప్‌ని ప్రేమ‌గా మాత్రం మార్చుకోరు. ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ను అన్ని ర‌కాల జెండ‌ర్లు చేసుకుంటున్నారు. అంటే ఒక అమ్మాయి, అబ్బాయి మాత్ర‌మే కాకుండా ఇద్ద‌రు అమ్మాయిలు, ఇద్ద‌రు అబ్బాయిలు కూడా ఈ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.

2015 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 500 మంది జంట‌లు ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ను చేసుకున్నారు. మ‌రో విష‌యం ఏంటంటే.. వారికి లైంగిక వాంఛ‌లు తీరాలంటే వేరొకరి వ‌ద్ద‌కు వెళ్తారు కానీ ఫ్రెండ్స్‌తో మాత్రం చేయ‌ర‌ట‌. అంతేకాదు.. వారు కావాల‌నుకుంటే వేరొక‌రితో రిలేష‌న్‌షిప్‌లో కూడా ఉండొచ్చు. కానీ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న వ్య‌క్తుల్ని మాత్రం పెళ్లి చేసుకోర‌ట‌. ఏంటో ఈ వింత మ‌నుషులు.. వింత అల‌వాట్లు..!