Symbiosexual: ప్రేమికుల మ‌ధ్య దూరే ఈ లింగం వారితో జాగ్ర‌త్త‌..!

all you need to know about Symbiosexual

Symbiosexual: ఒక‌ప్పుడు మ‌గ‌వారు, ఆడ‌వారు అనే రెండే లింగాలు ఉండేవి. ఇప్పుడు LGBTQ అనే కొత్త లింగాల వారూ ఉన్నారు. ఇద్ద‌రు ఆడ‌వారు ప్రేమించుకోవ‌డం.. ఇద్ద‌రు మ‌గ‌వాళ్లు ప్రేమించుకోవడం వంటి సంఘ‌ట‌న‌లు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వారికంటూ స‌మాజంలో గౌర‌వంగా బ‌తికే హ‌క్కు ఉంద‌ని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే ఇప్పుడు మ‌రో కొత్త లింగాన్ని శాస్త్రవేత్త‌లు క‌నుగొన్నారు. వారే సింబ‌యో సెక్సువ‌ల్.

ఏంటీ సింబ‌యో సెక్సువ‌ల్?

సింబ‌యో సెక్సువ‌ల్ అని ఎవ‌ర్ని అంటారంటే.. ఇద్ద‌రు ప్రేమికుల‌ను చూసి ముచ్చ‌ట‌ప‌డి వారితో పాటు క‌లిసుండాల‌ని కోరుకునేవారిని. మీరు చ‌దివింది క‌రెక్టే. ఇద్ద‌రు ప్రేమికుల‌ను చూసి వారిద్ద‌రిపై మ‌న‌సు పారేసుకుని పాన‌కంలో పుడ‌క‌లాగా దూరే వారినే సింబయో సెక్సువ‌ల్ అంటారు. అమెరికాలోని సియాటిల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ సింబ‌యో సెక్సువ‌ల్ అనే లింగం వారు కూడా స‌మాజంలో ఉన్నార‌ని తెలిసింది.

ఎలా తెలిసిందంటే.. ఒక 100 మందిని ఎంపిక చేసి వారిపై ఓ రీసెర్చ్ చేసారు. ఆ వంద మంది ముందు ప్రేమికుల‌ను నిల‌బెట్టారు. ఆ ప్రేమ జంట‌ల‌ను చూడ‌గానే ఆ వంద మందిలోని కొంద‌రికి ఒక ర‌క‌మైన ఫీలింగ్స్ క‌లిగాయ‌ట‌. ఎలాగంటే.. ఆ ప్రేమికుల‌తో పాటు ఉండాలనుకోవ‌డం.. వారితో అన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకోవ‌డం వంటివి. సింపుల్‌గా చెప్పాలంటే సింబ‌యో సెక్సువ‌ల్ లింగం వారికి ప్రేమ‌లో మ‌గ‌, ఆడ‌వారితో సెక్స్ చేయాల‌ని ఉంటుంద‌ట‌.