మెయింటైనెన్స్ సెక్స్‌తో బంధం పదిలం.. ఇందులో నిజమెంత?
Lifestyle: అమెరికాలో ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ మెయింటైనెన్స్ సెక్స్. దీని వల్ల కాపురాలు, బంధాలు బలపడతాయని అక్కడి రిలేషన్‌షిప్ నిపుణులు కూడా చెప్తున్నారు. అసలేంటీ మెయింటైనెన్స్ సెక్స్? కేప్రిస్ అనే 49 ఏళ్ల అమెరికన్ మోడల్, రిలేషన్‌షిప్ నిపుణురాలు ఓ ఇంటర్వ్యూలో ఈ మెయింటైనెన్స్ సెక్స్ గురించి మాట్లాడటంతో అమెరికాలో ఇది బాగా ట్రెండ్ అవుతోంది. మెయింటైనెన్స్ సెక్స్ అనేది ప్రతి రోజూ ఒక ఐదు నుంచి పది నిమిషాలు చేసే శృంగారమట. దీని వల్ల బంధం మరింత బలపడుతుంది అని చెప్పడానికి తన కాపురమే ఓ ఉదాహరణ అని అంటున్నారు. తన దగ్గరికి వచ్చే చాలా మంది క్లైంట్స్‌కి ఈ విషయం చెప్పాక వారి సంసారాలు ఇప్పుడు సాఫీగా సాగుతున్నాయని తెలిపారు.
అయితే ఇది మన ఇండియాలో వర్కవుట్ అవ్వదంటూ కేప్రిస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారతీయ వైద్యురాలు డాక్టర్ ప్రగ్యా అగర్వాల్. ఏ మహిళ కూడా తమ భర్తతో ఇలా మెయింటైనెన్స్ సెక్స్ చేయకూడదని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మెయింటైనెన్స్ సెక్స్ అనేది మూడ్ ఉన్నా లేకపోయినా చేయాలి. అలా సాధ్యం కాదు కదా? ఎందుకంటే శృంగారం అనేది భార్యాభర్తలు ఇష్టంతో చేయాల్సిన కార్యం. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా ఫోర్స్ చేయకూడదు. చివరిగా చెప్పొచ్చింది ఏంటంటే.. అమెరికా లాంటి మోడ్రన్ దేశాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడటం సహజమే. కానీ మనం ఇండియాలో ఉన్నాం. ఇలాంటివన్నీ ఇక్కడ కుదరవు. కాబట్టి ఇతర దేశాలకు చెందిన వారు ఇలాంటివి మీడియా ముందుకు వచ్చి చెప్తే గుడ్డిగా ఫాలో అయిపోవద్దని మన నిపుణులు హెచ్చరిస్తున్నారు.