Lifestyle: ఫీమేల్ కండోమ్స్ అంటే ఏంటి? ఎలా వాడాలి?
Lifestyle: సురక్షితమైన శృంగారం చేసే సమయంలో మగవారు కండోమ్ ధరిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మార్కెట్‌లోకి ఆడవారి కోసం తయారుచేయబడిన కండోమ్స్ కూడా వస్తున్నాయి. మగవారు కండోమ్స్ ధరించడం వల్ల ఆ ప్లెజర్ రావడం లేదని.. శాస్త్రవేత్తలు ఆడవారి కోసం కండోమ్స్ తయారుచేసారు. ఆడవారి కోసం తయారు చేసిన కండోమ్స్ ద్వారా 99% గర్భం దాల్చకుండా చేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. లైంగిక అనారోగ్య సమస్యల నుంచి కూడా 99% రక్షణ కల్పిస్తుందట. ఈ కండోమ్స్ ఎలా వాడాలో చెప్పేందుకు యూట్యూబ్‌లో వీడియోలు కూడా ఉన్నాయి. ఈ కండోమ్స్ కొన్ని మార్కెట్లలో అందుబాటులోకి కూడా వచ్చాయి.