Lifestyle: పచ్చని కాపురంలో నిప్పులు పోసిన స్నేహితురాలు
Lifestyle: ఎవరో చెప్పిన మాటలు విని భర్తనో భార్యనో అనుమానిస్తే జీవితం ఎలా నాశనం అవుతుందో తెలియజేసే కథ ఇది. ఓ మహిళ తాను స్వయంగా అనుభవిస్తున్న బాధను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అలాంటి స్నేహితులకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తోంది.
అమెరికాకు చెందిన లీసా అనే యువతికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అన్యోన్యంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో లీసా స్నేహితురాలు సారాకు తన భర్త మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తున్నాడని తెలిసింది. దాంతో వెంటనే ఈ విషయాన్ని లీసాకు చెప్పుకుని తెగ బాధపడింది. ఆమె బాధ పడితే పడింది. కానీ ఓదారుస్తున్న లీసాకు తన భర్త గురించి లేనిపోనివి నూరిపోసింది.
నా భర్త ఇలా మోసం చేసాడంటే.. కచ్చితంగా నీ భర్తకు కూడా ఎవరితోనో సంబంధం ఉండే ఉంటుంది అనే అనుమాన బీజాన్ని నాటి వెళ్లిపోయింది. దాంతో సారా తనని తాను ఎంత సముదాయించుకున్నా మనసు నిలవలేదు. దాంతో తన భర్తకు ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ని నియమించింది. అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకునేది. ఇలా రెండు వారాలు గడిచాక తన భర్తకు ఎవ్వరితోనూ అక్రమ సంబంధం లేదని తెలిసి సంతోషించింది. ఆ తర్వాత ప్రైవేట్ డిటెక్టివ్‌ని తీసేసింది.
లీసా ఎన్నిసార్లు క్షమించమని కోరినా అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఓసారి ఆలస్యంగా ఇంటికి వస్తే.. లీసా ఏమీ అడగకుండానే నేను ఎవ్వరితోనూ కులికి రాలేదులే అని మండిపడ్డాడట. ఇలా పచ్చని సంసారం తన స్నేహితురాలి వల్ల పాడైందని.. ఇప్పుడు తన భర్తకు తనపై మునుపటి లాగా ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటాయో లేదో అని లీసా తెగ బాధపడుతోంది. ఇలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్త అంటూ పోస్ట్‌లో పేర్కొంది.ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ తన ఫోన్లో డిటెక్టివ్‌తో చేసిన మెసేజీలు, కాల్స్ మాత్రం డిలీట్ చేయలేదు. తన ఫోన్ ఎవరు చెక్ చేస్తారులే అనుకుంది. దాంతో ఓ సారి లీసా భర్త ఆమె ఫోన్లో ఏదో పని ఉండి తీసాడు. అందులో డిటెక్టివ్‌తో లీసా చేసిన చాట్స్ అన్నీ చదివి ఎంతో బాధపడ్డాడు.